కాంగ్రెస్‌లోకి గద్దర్.. గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ..?

sivanagaprasad kodati |  
Published : Oct 12, 2018, 07:53 AM ISTUpdated : Oct 12, 2018, 07:54 AM IST
కాంగ్రెస్‌లోకి గద్దర్.. గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ..?

సారాంశం

ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. 

ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇవాళ ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్‌పై గద్దర్ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ ఛైర్మన్ మల్లు భట్టీ విక్రమార్కతో గద్దర్ భేటీ అయినప్పుడే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిస్కషన్ నడిచింది. టీఆర్ఎస్ పాలనపై అసంతృప్తితో ఉన్న గద్దర్.. మహాకూటమికి అనుకూలంగా ప్రచారం జరిగింది..

ఈ నేపథ్యంలో గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేయిస్తే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని కాంగ్రెస్ నేతలు సైతం భావించారు. అయితే దీనిపై ఇరు వర్గాల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్‌లో గద్దర్ చేరరని అనుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన హస్తం గూటికి చేరుతుండటంతో అది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, మహాకూటమికి ఎంతోకొంత కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే గద్దర్ తనయుడు సూర్యం కాంగ్రెస్‌లో ఉన్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu