కాంగ్రెస్ నేత, పాలేరే ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ముగిశాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో వున్న రాఘవా ప్రైడ్ ఆఫీసుతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెం 17లో వున్న ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే
కాంగ్రెస్ నేత, పాలేరే ఎమ్మెల్యే అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ సోదాలు ముగిశాయి. ఈ సందర్భంగా 3 బ్యాగులు, బ్రీఫ్కేస్, ప్రింటర్, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో వున్న రాఘవా ప్రైడ్ ఆఫీసుతో పాటు జూబ్లీహిల్స్ రోడ్ నెం 17లో వున్న ఇంట్లో ఐటీ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఖమ్మం నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన కుటుంబ సభ్యుల నుంచి అధికారులు కీలక వివరాలు సేకరించారు. గురువారం తెల్లవారుజాము నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. బెంగళూరు, చెన్నైకి చెందిన 200 మందికి పైగా అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
undefined
మరోవైపు.. ఐటీ దాడులపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఇవాళ తాను నామినేషన్ వేస్తున్నానని తెలిసే ఐటీ దాడులు జరిగాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయని.. ఉద్దేశపూర్వకంగానే ఐటీ దాడులు చేయిస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారన్నట్లుగా లక్ష కూడా పట్టుకోలేదని పొంగులేటి వ్యాఖ్యానించారు