టైలరింగ్ ద్వారా సంపాదించా: ఐటీ అధికారులకు షాకిచ్చిన నయీం భార్య

By narsimha lodeFirst Published Nov 27, 2019, 3:50 PM IST
Highlights

గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తులను ఐటీ శాఖాధికారులు తేల్చే పనిలో పడ్డారు. నయీమ్ భార్య హసీనా భేగం  నుండి ఆదాయ పన్ను శాఖాధికారులు సమాచారాన్ని సేకరించారు.

హైదరాబాద్:  గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తులను లెక్క తేల్చే పనిలో ఐటీ శాఖ ఉంది. నయీమ్ ఆస్తుల వివరాలను  నయీమ్ భార్య హసీనా బేగం నుండి ఆదాయ పన్ను శాఖాధికారులు తేల్చే పనిలో ఉన్నారు. బినామీల పేరిట కోట్లాది రూపాయాలను ఉన్నట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు.

Also read:

గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల వివరాలను ఇవ్వాలని  పోలీస్ శాఖను ఐటీ శాఖ గతంలో కోరింది. నయీమ్ భార్య హసీనా బేగంను  ఆదాయ పన్ను శాఖాధికారులు తేల్చారు.  టైలరింగ్ ద్వారా ఆదాయాన్ని సంపాదించినట్టుగా గ్యాంగ్‌స్టర్ నయీమ్ భార్య హసీనా ఐటీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చింది. 

నయీమ్ భార్య హసీనా నుండి ఆదాయ పన్ను శాఖాధికారులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కోట్లాది రూపాయాలను కలిగి ఉన్న నయీమ్ భార్య ఆదాయ పన్నును ఎగ్గొట్టినట్టుగా గుర్తించారు.

2016 ఆగష్టు 8వ తేదీన గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను  పోలీసులు షాద్‌నగర్‌ సమీపంలోని మిలినీయం సీటీలో  ఎన్‌కౌంటర్ చేశారు. నయీమ్ కు చెందిన ఇళ్లతో పాటు ఆయన అనుచరుల ఇళ్లలో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున నగదును, ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు ఇచ్చిన నివేదిక ఆధారంగా నయీమ్ భార్య హసీనా బేగంను ఆదాయ పన్ను శాఖాధికారులు విచారించారు.

భారీగా ఆస్తులను ఎలా సంపాదించారని  ఆదాయపు పన్ను శాఖాధికారులు హసీనా బేగంను ప్రశ్నిస్తే ఆమె నివ్వెరపోయే సమాధానం ఇచ్చారు.టైలరింగ్ ద్వారానే ఈ ఆస్తులను సంపాదించినట్టుగా ఆమె ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం విన్న ఐటీ అధికారులు షాక్ తిన్నారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు  ఐటీ శాఖాధికారులు.

 

click me!