సీఎం (CM) అనే రెండు అక్షరాల కంటే కేసీఆర్ (KCR) అనే మూడు అక్షరాలు మరింత ప్రమాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS Working president), మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. త్వరలోనే కేసీఆర్ ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు.
KTR : మాజీ సీఎం కేసీఆర్ అధికార పక్షంలో ఉండటం కన్నా.. ప్రతిపక్షంలో ఉండటమే ప్రమాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అధికారంలో కంటే విపక్షంలోనే ఉంటేనే పోరాట ప్రతిమ చూపిస్తుందని తెలిపారు. గత అసెంబ్లీ సమావేశాల్లో తాము ఎలా వ్యవహరించామో ప్రజలందరూ చూశారని అన్నారు.
రోడ్డుపై దర్శనమిచ్చిన ప్రజా పాలన దరఖాస్తులు.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
రాబోయే రోజుల్లో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ తెలిపారు. ఆ సమమయంలో ఎలా ఉంటుందో ఊహించుకోవాలని తెలిపారు. సీఎం అనే రెండు అక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలు ఎంతో శక్తివంతమైనవని అన్నారు. ఫిబ్రవరి నెలలో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని తెలిపారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
తెలంగాణ భవన్‌లో జరుగుతున్న బీఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్ రావు,… pic.twitter.com/N5igGBrJai
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అయ్యిందని, హామీలను నిలబెట్టుకోవడంలోనే ఆ పార్టీ చిత్తశుద్ధి ఎంతో మరో సారి తేటతెల్లమైందని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పారు. ఇచ్చిన హామీల అమలు చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని పునరుద్ఘాటించారు. అన్ని స్థాయిల్లో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ క్యాడర్ సిద్ధంగా ఉండాలని కోరారు.
ప్రధాని ప్రతీది పర్సనల్ గా తీసుకుంటారు - భారత్-మాల్దీవుల వివాదంపై మల్లికార్జున్ ఖర్గే
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం వంటి కొన్ని జిల్లాల్లో కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయని, అయినా బీఆర్ఎస్ పూర్తిగా తిరస్కరణకు గురికాలేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 39 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుందని చెప్పారు. 11 నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిందని చెప్పారు. ఇతర సమస్యల కారణంగా మరికొన్ని సీట్లు కోల్పోయామని తెలిపారు. ప్రజల అసంతృప్తికి గల కారణాలపై సమగ్రంగా చర్చించి పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.
జపాన్ లో మళ్లీ భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.0 తీవ్రత నమోదు..
1989 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్టీ రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీపై విజయం సాధించిన కొద్ది కాలానికే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారితీసిందని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ప్రజల ఆకాంక్షలను అందుకోవడంలో విఫలమైతే జరిగే పరిణామాలను అర్థం చేసుకోవాలని కోరారు.