మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కోరింది రాష్ట్ర ప్రభుత్వం.
హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషీయల్ విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు లేఖ రాసింది.
also red:ఆ అధికారులకు తిప్పలు తప్పవా?: బీఆర్ఎస్ సర్కార్ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన రేవంత్
undefined
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషీయల్ విచారణ నిర్వహిస్తామని తెలంగాణ శాసనమండలిలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేఖ రాసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 12 చోట్ల విజిలెన్స్ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఇటీవల కీలకమైన కంప్యూటర్లు, ఫైల్స్ మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగిన ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
also read:అరవింద్ కు బిగుస్తున్న ఉచ్చు: ఫార్మూలా ఈ-రేస్ కు రూ. 50 కోట్ల విడుదలపై మెమో జారీ
విజిలెన్స్ సోదాలు, జ్యుడీషీయల్ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా ఎవరు వ్యవహరించారనే దానిపై గుర్తించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టుకు టెండర్ ను ఎలా ఫైనల్ చేశారు. ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించింది ఎవరనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.విజిలెన్స్ నివేదిక, జ్యుడీషీయల్ విచారణ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏం జరిగిందనే అంశాలను బయట పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. కాళేళ్వరం ప్రాజెక్టు కంటే ముందు ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం ప్రతిపాదన ఉంది. అయితే ఈ ప్రతిపాదనను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టును భారత రాష్ట్ర సమితి సర్కార్ తెరమీదికి తెచ్చింది.
also read:మేడిగడ్డపై అధికారులకు ఉచ్చు: 12 చోట్ల ఏకకాలంలో విజిలెన్స్ సోదాలు
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించకుండా ఎందుకు పక్కన పెట్టారనే విషయమై కాంగ్రెస్ సర్కార్ అన్వేషణ ప్రారంభిస్తుంది. ఈ విషయమై అప్పటి సర్కార్ చెబుతున్న కారణాలు సహేతుకమైనవేనా కావా అనే విషయాలను ఈ విచారణల ద్వారా బయటపెట్టాలని భావిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేసీఆర్ సర్కార్ గొప్పగా ప్రచారం చేసుకుంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అప్పట్లోనే విపక్షాలు విమర్శలు చేశాయి.
also read:కేసీఆర్ సహా ఆ ముగ్గురు పార్లమెంట్‌కేనా: బీఆర్ఎస్ వ్యూహం ఏమిటీ?
గత ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించిందనే విషయాలను అసెంబ్లీలో కూడ ఎండగట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయమై బీఆర్ఎస్ తీరును ఎండగట్టేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తుంది. మరో వైపు అసెంబ్లీ బయట కూడ ఈ విషయాలపై బీఆర్ఎస్ సర్కార్ తీరును ఎండగట్టాలని ప్రభుత్వం తలపెట్టింది.