వైఎస్ షర్మిల శిబిరంలో కరోనా కలకలం..!

By telugu news teamFirst Published Apr 20, 2021, 7:26 AM IST
Highlights

పరీక్షల్లో షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డితోపాటు మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ దీక్షలో యాక్టివ్‌గా ఉన్న నేతలూ కరోనా పరీక్ష బాట పట్టారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల శిబిరంలో కరోనా కలకలం సృష్టించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో లోట్‌సపాండ్‌ కార్యాలయం వద్ద షర్మిల దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదివారం దీక్ష విరమణ అనంతరం.. షర్మిల మద్దతుదారులు కొందరు కొవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. 

పరీక్షల్లో షర్మిల ముఖ్య అనుచరుడు పిట్టా రాంరెడ్డితోపాటు మరో ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఈ దీక్షలో యాక్టివ్‌గా ఉన్న నేతలూ కరోనా పరీక్ష బాట పట్టారు. షర్మిల సహా ముఖ్యనేతలు.. ప్రైమరీ కాంటాక్టు కావడంతో వారం పాటు లోట్‌సపాండ్‌ కార్యాలయానికి సెలవు ప్రకటించారు. 

ఇదిలా ఉండగా, సోమవారం వైఎస్‌ విజయమ్మ పుట్టిన రోజు వేడుకలను.. కుటుంబ సభ్యుల మధ్యే నిరాడంబరంగా నిర్వహించారు. కాగా, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయాలన్న డిమాండ్‌తో సోమవారం పలు జిల్లాల్లో షర్మిల మద్దతుదారులు రిలే దీక్షలు నిర్వహించారు. 

హైదరాబాద్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ముఖ్య నేత ఇందిరాశోభన్‌ సంఘీభావం తెలిపారు. కాగా కరోనా చికిత్సను తక్షణమే ఆరోగ్యశ్రీలో చేర్చాలని షర్మిల పార్టీ నేత ఇందిరాశోభన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

click me!