తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదాయపన్నుశాఖ అలర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తోంది. సరైన పత్రాలు లేని అక్రమ నగదు, బంగారాన్ని భారీగా సీజ్ చేస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదాయపన్నుశాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. సరైన పత్రాలు లేని అక్రమ నగదు, బంగారాన్ని భారీగా సీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా ఇన్ కమ్ ట్యాక్స్ డైరెక్టర్ జనరల్ సంజయ్ బహదూర్ మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ శాఖ అలర్ట్ గా పని చేస్తుందని పేర్కొన్నారు. పత్రాలు లేని నగదు, బంగారం, సీజ్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఇప్పటి వరకు రూ.1.76 కోట్లు మాత్రమే సీజ్ చేసినట్లు తెలిపారు. అన్ని పత్రాలను పరిశీలించే సీజ్ చేసిన బంగారం, సిల్వర్ ను ఇచ్చేస్తున్నామని తెలిపారు. అలాగే.. పోలీస్ శాఖ నుండి రూ.53.93 కోట్లు, 156 కేజీల బంగారం, 454 వెండిని ఆదాయ పన్నుశాఖకు వచ్చాయని తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్యూఆర్టీ టీమ్స్ పని చేస్తున్నాయని, ఆదాయపన్నుశాఖ నుంచి దాదాపు 250 మంది అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. రూ.10లక్షలకు మించి నగదు స్వాధీనం అయినప్పుడు మాత్రమే ఐటీశాఖకు సమాచారం అందిస్తారనీ, అంతకంటే తక్కువ నగదు పట్టుబడితే స్థానిక యంత్రాంగమే దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ఐటీ యాక్ట్ సెక్షన్ 132, 132(a) కింద నగదు సీజ్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.53.93 కోట్లు సీజ్ చేశామని, 156 కేజీల బంగారం, 464 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే.. అందులో రూ.1.76 కోట్లు మాత్రమే లెక్కల్లో చూపని డబ్బు ఉందని, అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత రూ.10.99 కోట్లు తిరిగిచ్చినట్టు పేర్కొన్నారు. మిగతా నగదుపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. ఇక బంగారం, వెండి విషయంలో అనధికారికంగా రవాణా అవుతున్నది ఏదీ లేదని సంజయ్ వెల్లడించారు. 2018 ఎన్నికల్లో ఇన్ ఆదాయపన్నుశాఖ రూ.20 కోట్ల నగదు సీజ్ చేసిందన్నారు.