ఆలంపూర్, గోషామహల్ పై బీఆర్ఎస్ సస్పెన్స్.. అభ్యర్థులపై అస్పష్టత.. ఆశావహుల్లో ఆందోళన

By Mahesh K  |  First Published Oct 25, 2023, 11:53 PM IST

ఆలంపూర్, గోషామహల్ స్థానాలపై బీఆర్ఎస్ సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నది. ఎన్నికల గడువు సమీపించినప్పటికీ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై ఆందోళన నెలకొంది. ఆలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరు జాబితాలో ఉన్నప్పటికీ బీఫాం అందించకపోవడంతో ఆయన ప్రగతి భవన్, తెలంగాణ భవన్‌లలో చక్కర్లు కొడుతున్నట్టు తెలుస్తున్నది.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అభ్యర్థుల జాబితాను ప్రకటించడంలో పార్టీలు బిజీగా ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు సుమారు రెండు నెలల ముందే దాదాపు 119 స్థానాలకు గాను 115 స్థానాలను బీఆర్ఎస్ ప్రకటించింది. ఆ తర్వాత కాంగ్రెస్, బీజేపీలు కూడా తొలి జాబితాను విడుదల చేశాయి. రెండో జాబితా ఇవాళ, రేపా అన్నట్టుగా ఉన్నాయి. ఈ సందర్భంలో ఎన్నడో జాబితా ప్రకటించిన బీఆర్ఎస్ కూడా కొన్ని స్థానాల్లో సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తున్నది.

ఎన్నికలకు గడువు సమీపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ మాత్రం ఈ స్థానాల్లో అభ్యర్థులపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తున్నది. మరో నెల రోజులు మాత్రమే ఉండటంతో ఆశావహుల్లో, క్యాడర్‌లోనూ గందరగోళం మొదలైంది. గోషామహల్, నాంపల్లి స్థానాల్లో ఆశావహులు ముందుకు వచ్చినప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం చొరవ తీసుకోవడం లేదు.

Latest Videos

Also Read: Kishan Reddy: 'కల్వకుంట్ల కుటుంబ ఏటీఎం కాళేశ్వరం'

అలాంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహం పేరును కేసీఆర్ అభ్యర్థుల జాబితాలో ప్రకటించినప్పటికీ బీఫాం అందించలేదు. కాగా, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రాంరెడ్డి అనుచరుడు విజేయుడికి టికెట్ కన్ఫామ్ చేశారనే ప్రచారం జరుగుతున్నది. దీంతో అబ్రహం బీఫాం అందించాలని ప్రగతి భవన్, తెలంగాణ భవన్‌లో చక్కర్లు కొడుతున్నారు. కేటీఆర్, హరీశ్ రావులనూ ఆయన కలిసినట్టు తెలిసింది.

click me!