తెలంగాణ కొత్త సచివాలయ భవనాలు ఇవేనా?

Published : Sep 06, 2017, 08:55 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
తెలంగాణ కొత్త సచివాలయ భవనాలు ఇవేనా?

సారాంశం

ఇవే కొత్త సచివాలయం భవనాల నమూనా అంటూ ఫొటోలు వైరల్ జోరుగా సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ

తెలంగాణ కొత్త సచివాలయంపై సిఎం కేసిఆర్ తీవ్రమైన పట్టుదలతో ఉన్నారు. వాస్తు దోషం కారణంగా సచివాలయంలో కాలు పెట్టేందుకే కేసిఆర్ సాహసించడంలేదు. దీంతో ఎంత డబ్బు ఖర్చైనా పరవాలేదు. అద్భుతమైన, సకల సౌకర్యాలు కలిగిన కొత్త సచివాలయం నిర్మించాలని తలంచారు ముఖ్యమంత్రి.

ఈ నేపథ్యంలో కొత్త సచివాలయం ఎక్కడ అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడున్న సచివాలయంలోని భవనాలన్నీ నేలమట్టం చేసి కొత్త భనాలు నిర్మిస్తారా? లేక సికింద్రాబాద్ లోని బైసన్ పోలో గ్రౌండ్ లో కొత్త సచివాలయం భవనాలు నిర్మిస్తారా ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే కొత్త సచివాలయం నమూనా ఇదేనంటూ కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే అవి కొత్త సచివాలయం భననాలు కాదు పాడు కాదు అంటూ కొందరు వాదిస్తున్నారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ గ్రూపుల్లో చర్చంతా కొత్త సచివాలయ భవనాలపైనే జోరుగా సాగుతోంది.

కొత్త నమూనాలు ఇవీ....

 

నిజానికి ఈ వైరల్ అవుతున్న సచివాలయ ఫొటోలు నిజమైనవేనా? లేక కాంగ్రెస్ నేతలు ఇవాళ బైసన్ పోలో గ్రౌండ్ పరిశీలించిన నేపథ్యంలో ఈ ఫొటోలను కావాలని సోషల్ మీడియాలో ఉంచారా అన్నది తేలాల్సి ఉంది. సికింద్రాబాద్ లో ఇప్పటికే విపరీతమైన ట్రాఫిక్ కు తోడు సచివాలయం తరలిస్తే మరింత ట్రాఫిక్ పెరగుతందని కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది. అయితే ఈ కొత్త సచివాలయం చిత్రాల విషయంలో ఇప్పటి వరకు సిఎం కార్యాలయం నుంచి కానీ, సచివాలయ అధికార వర్గాల నుంచి కానీ ఇంకా ధృవీకరణ కాలేదు. గతంలో కొన్ని చిత్రాలు బయటకొచ్చాయి. కానీ తర్వాత ఏమైందో వాటి జాడ లేనేలేదు.
మరి తాజాగా మరికొన్ని చిత్రాలు వెలుగులోకి వచ్చాయి. సచివాలయం మార్పుపై మూడేళ్లపాటు హడావిడి చేసినా ఇప్పటి వరకు ఏదీ ఫైనల్ కాలేదు. మరి ఈ చిత్రాలు కూడా ఉత్తదే అవుతాయా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే