
ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తు.. మరో వైపు రెసిడెన్షియల్ ప్రారంభిస్తామని తెలంగాణ సర్కార్ చెబుతోంది. గత మూడు సంవత్సరాలగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వని తెలంగాణ సర్కార్, తాజాగా నూతన రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం మాత్రం ప్రయత్నాలు ప్రారంభించింది.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 31 జిల్లాల్లో ప్రతి జిల్లాకు రెండు జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని హమీ ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత విద్యనే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. బుధవారం కడియం విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు కడియం. ప్రతి జిల్లాకు ఒక బాలుర, ఒక బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఉండాలన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు కడియం ఆదేశించారు. కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత కొన్ని జిల్లాల్లో జనరల్ బాలుర రెసిడెన్షియల్ లేవన్నారు, ఈ నిర్ణయంతో ప్రతి ప్రాంతంలో రెసిడెన్షియల్ స్కూళ్లు ఉన్నట్లవుతుందని పేర్కొన్నారు. విద్యా విధానం పై ప్రత్యేక కమిటీని నియమించాలని అధికారులకు సూచించారు. ఆ కమిటీలో సమర్ధులైన హెడ్ మాస్టార్లతో నియామకానికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
అదేవిధంగా స్కూళ్లలో డిజిటల్ క్లాసుల నిర్వహణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విద్యాశాఖ అభివృద్ది కోసం మరిన్ని మౌళిక సదుపాయాల పై పూర్తి స్థాయి అధ్యయం పై కమిటీ పని చేస్తుందన్నారు. వారు 3 నెలల్లో నివేదికకు సమర్పించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా కాలేజీలుగా అప్ గ్రేడ్ అయిన 35 రెసిడెన్షియల్ స్కూళ్ల మౌలిక వసతులు, సిబ్బందిపై ప్రతిపాదనలు పంపాలని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి....