రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి: అతి వేగమే కారణమా?

By narsimha lode  |  First Published Feb 23, 2024, 10:07 AM IST

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణించిన కారు అతి వేగంతో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.  అతి వేగం కూడ ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.


హైదరాబాద్: కంటోన్మెంట్  ఎమ్మెల్యే లాస్య నందిత  ప్రయాణీస్తున్న కారు  పటాన్ చెరు ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదం జరిగిన సమయంలో  ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న కారు అతి వేగంతో ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదానికి అతి వేగంతో పాటు వాహనం నడుపుతున్న డ్రైవర్ నిద్రమత్తు కూడ కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 

ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణీస్తున్న కారు  రెయిలింగ్ ను ఢీకొనడానికి  150 నుండి 200 మీటర్ల దూరం వరకు  కారు భాగాలు పడిపోయాయి.అంతేకాదు  రోడ్డుపై  టైర్ గుర్తులు కూడ కన్పించాయి.  

Latest Videos

also read:అచ్చిరాని ఫిబ్రవరి: తండ్రి మరణించిన ఏడాదికే లాస్య నందిత మృతి

ఎమ్మెల్యే లాస్య నందిత  ప్రయాణీస్తున్న కారు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో  ప్రయాణీస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు.  ప్రమాదం జరిగిన ప్రదేశంలో  కారు విడిభాగాలు పడిపోవడాన్ని చూస్తే  కారు చాలా వేగంతో ప్రయాణీస్తున్నట్టుగా పోలీసులు  అనుమానిస్తున్నారు.  అయితే  ఎమ్మెల్యే ప్రయాణీస్తున్న కారు  ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టిందా... లేదా  అతి వేగంతో  కారు కంట్రోల్ తప్పి  రెయిలింగ్ ను ఢీకొట్టిందా డ్రైవర్ నిద్రమత్తులో  కారుపై అదుపును కోల్పోయాడా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ప్రమాదంలో కారును డ్రైవ్ చేస్తున్న  వ్యక్తి  తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం  తీవ్రంగా దెబ్బతింది.ఈ ప్రమాదం విషయాన్ని తెలిసిన  వెంటనే లాస్య నందితను  ఆసుపత్రికి  తరలించారు.  అయితే వైద్యులు ఆమెను పరీక్షించి మృతి చెందినట్టుగా  ప్రకటించారు.  ఈ ప్రమాదంలో గాయపడిన  డ్రైవర్ ను ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.

 


 

click me!