
రాష్ట్రపతి ఎన్నికల్లో అరుదుగా కనిపించే సంఘటన ఒకటి పార్లమెంట్‌లో కనిపించింది. రాష్ట్రంలోని విధాన సభలో ఓటేయాల్సిన ఎమ్మెల్యే ఒకరు పార్లమెంట్‌లో ఓటేసారు. చూసేవారు ఆయన ఎమ్మెల్యేనా, ఎంపీనా అన్న అనుమానంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇలా ఎన్నికల్లో ఓటేసింది ఎవరో కాదు... బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. గుజరాత్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్న ఆయన, ఎన్నికల సంఘం అనుమతితో ఇళా పార్లమెంట్‌లో ఓటేశారు. ఇలా ఐదుగురు ఎమ్మెల్యేలకు తమ ఓటును పార్లమెంట్‌లో వేసుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది.వారిలో అమిత్ షా లాంటి రాజకీయ ప్రముఖులు ఉండటం ప్రాదాన్యతను సంతరించుకుంది.
అమిత్ షా నేరుగా పార్లమెంట్‌లోని రూమ్‌నెంబర్ 62లో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ కి చేరుకుని ఓటుహక్కును వినియోగించుకున్నారు.ఈయనను అక్కడ గమనించిన వారు మాత్రం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి పార్లమెంట్‌లో ఓటేయడంతో అ అనుమానానికి లోనయ్యారు.