తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీ : డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు.. అంజనీ కుమార్, సీవీ ఆనంద్‌లకు పోస్టింగ్స్

Siva Kodati |  
Published : Dec 19, 2023, 07:55 PM ISTUpdated : Dec 19, 2023, 08:01 PM IST
తెలంగాణలో 20 మంది ఐపీఎస్‌ల బదిలీ : డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు.. అంజనీ కుమార్, సీవీ ఆనంద్‌లకు పోస్టింగ్స్

సారాంశం

రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. తాజాగా మంగళవారం 20 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. తెలంగాణ డీజీపీగా రవిగుప్తాను కొనసాగిస్తూ.. ఇటీవల ఈసీ వేటు వేసిన అంజనీ కుమార్, సీవీ ఆనంద్‌లకు కూడా పోస్టింగ్స్ ఇచ్చింది.   

  • తెలంగాణ డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు
  • ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్
  • జైళ్ల శాఖ డీజీగా సౌమ్యా మిశ్రా
  • రోడ్ సేఫ్టీ డీజీగా అంజనీ కుమార్
  • సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్ర
  • అప్పా డైరెక్టర్‌గా అభిలాష్
  • ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్‌గా కమలాసన్ రెడ్డి
  • టీఎస్‌పీఎస్సీ డీజీగా అనిల్ కుమార్
  • రైల్వే డీజీగా మహేష్ భగవత్
  • హోంగార్డ్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర
  • పోలీస్ హౌసింగ్ బోర్డ్ అడిషనల్ డైరెక్టర్‌గా ఎం రమేష్
  • సీఐడీ చీఫ్‌గా శిఖా గోయల్
  • ఎస్ఐబీ చీఫ్‌గా సుమతి
  • సీఐడీ డీఐజీగా రమేష్ నాయుడు
  • కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సీపీగా సత్యనారాయణ
  • పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఎండీగా రాజీవ్ రతన్
  • మల్టీజోన్ ఐజీగా తరుణ్ జోషి
  • ఏసీబీ డైరెక్టర్‌గా ఏఆర్ శ్రీనివాస్
  • పర్సనల్స్ ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్