హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు.. 1 గంట వరకే పర్మిషన్, డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే

By Siva KodatiFirst Published Dec 19, 2023, 6:35 PM IST
Highlights

న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు.  రాత్రి 1 గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే 10 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష వుంటుందని హెచ్చరించారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని వెల్లడించారు. 

మరికొద్దిరోజుల్లో పాత సంవత్సరానికి ప్రపంచం వీడ్కోలు పలకనుంది. సరికొత్త ఆశలు, ఆశయాలతో 2024కు ప్రజలు స్వాగతం పలకనున్నారు. ఎప్పటిలాగే డిసెంబర్ 31 రాత్రి న్యూఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు కుర్రకారు రెడీ అవుతున్నారు. అలాగే పోలీసులు కూడా వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నారు. హైదరాబాద్ విషయానికి వస్తే.. రాత్రి 1 గంటలోపే వేడుకలు ముగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే అనుమతులు తీసుకోవాలని, ప్రతి ఈవెంట్‌లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వేదికలపై అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయరాదని, 45 డెసిబుల్స్‌కు మించి శబ్ధం రాకుండా చూడాలని ఆదేశించారు. 

సామర్ధ్యానికి మించి పాస్‌లు ఇవ్వొద్దని.. పార్కింగ్‌కు స్థలం కేటాయించాలని, భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని పలీసులు సూచించారు. మద్యానికి అనుమతి వుండే కార్యక్రమాల్లో మైనర్ల ప్రవేశంపై నిషేధం విధించారు. డ్రగ్స్ వాడినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని , వేడుకలకు అనుమతించిన సమయం ముగిసిన తర్వాత మద్యం సరఫరా చేస్తే చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుపడితే 10 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష వుంటుందని హెచ్చరించారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని వెల్లడించారు. 

Latest Videos

click me!