
రెజిమెంటల్ బజార్ : Thefts, scams చేయడంలో రోజులో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అంతకు ముందు ఇలా కూడా చేయచ్చని తెలియని రీతుల్లో దొంగతనాలకు పాల్పడుతూ.. తమ క్రియోటివిటీ చూపిస్తున్నారు మోసగాళ్లు. అలా సికింద్రాబాద్ లోని
Regimental Bazaarలో కొత్తరకం దొంగతనాలకు పాల్పడ్డారు కొంతమంది. వివరాల్లోకి వెడితే.. పూజలు చేసి ప్రసాదం ఇస్తే పిల్లలు పుడతారని నమ్మించి.. మహిళల మెడలో Jewelry చోరీ చేస్తోంది Interstate gang ఒకటి.
నార్త్ జోన్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ చందన దీప్తి, అదనపు డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన గోవిండ్ మనోజ్ జాదవ్ (27) కన్నయ్యకిషన్ సాలుంకి (51), అశోక్ సురేష్ జాదవ్(44)లు బంధువులు. వీరి ప్రాంతంలో మధ్య నిషేధం ఉంది. దీంతో వీరు బయటినుంచి మద్యాన్ని తెచ్చి దొంగచాటుగా అమ్ముతుంటారు. వివిధ ప్రాంతాలకు వెళ్లి చోరీలకు పాల్పడుతుంటారు. గతంలో పలు కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. కొద్ది రోజుల క్రితం రైళ్లో నగరానికి వచ్చిన ఈ ముఠా.. లాడ్జీలో అద్దెకు దిగి చోరీలకు పథకం వేసింది.
శివరాత్రికి ముందు రోజు మోండా ఆదయ్యనగర్లో నివాసం ఉంటున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, మార్కెట్ లో పూజ సామాగ్రి కొని ఇంటికి వెడుతోంది. ఆమె వద్దకు ముగ్గురు ఒక్కసారిగా వచ్చారు. కాళ్లకు మొక్కారు. ఏమిటని ఆమె ప్రశ్నిస్తే.. పిల్లలు లేరని.. పిల్లలు పుట్టడానికి పూజలు చేయించామని, ఆ ప్రసాదం ఐదుగురు ముత్తాయిదువులకు ఇవ్వాలని పండితులు చెప్పారని నమ్మించారు. మత్తు మందు కలిపిన ప్రసాదం ఇచ్చారు. అది తిని ఆమె అక్కడే పడిపోయింది. ఆమె వద్ద ఉన్న 7 తులాల బంగార నగలతో ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదులో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితులను పట్టుకున్నారు. నగలు స్వాధీనం చేసుకుని వారిని రిమాండుకు తరలించారు. అశోక్ కోసం గాలిస్తున్నారు.
ఇలాంటి వెరైటీ దొంగతనమే మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో వైరల్ గా మారింది. madhya pradeshలో Royal Enfield బైక్‌లను (బుల్లెట్) నిముషం వ్యవధిలో దొంగతనం చేస్తున్న ఇద్దరు యువకులను నగర పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అంతేకాదు వారు theft ఎలా ఎంత ఈజీగా చేస్తారో పోలీసులకు demo చేసి చూపించారు. ఆ యువకుల చాకచక్యానికి పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
పోలీస్ స్టేషన్ లో డెమో చేస్తున్నప్పుడు పోలీసులు దీన్నంతా వీడియో తీశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్వాలియర్ నగరంలోని డీడీ నగర్ ప్రాంతంలో తాము కొట్టేసిన బుల్లెట్‌ను దాచేందుకు ఇద్దరు యువకులు అక్కడికి వస్తున్నారని తెలిసింది. దీంతో అక్కడి పోలీస్ ఇన్‌ఫార్మర్ ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో వెంటనే పోలీసులు అలెర్ట్ అయి రంగంలోకి దిగారు.
ఆ తర్వాత సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (సిఎస్‌పి) రవి భడోరియా బృందంగా ఏర్పడి వారిని పట్టుకునేందుకు డీడీ నగర్ ప్రాంతంలో తమ బలగాలతో మోహరించారు. యువకులు బుల్లెట్ తో అక్కడికి చేరుకోగానే పోలీసు బృందం చుట్టుముట్టి పట్టుకున్నారు.
యువకులను మోరెనా జిల్లాకు చెందిన శ్యామ్ గుర్జార్, బజ్నా గురాజ్‌లుగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి మూడు బైక్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు మంచి ధర రావడంతో వాటిని మాత్రమే దొంగిలిస్తున్నామని వారు విచారణలో పోలీసులకు తెలిపారు.ఇద్దరు యువకులను అరెస్టు చేశామని, తదుపరి చర్యలు కొనసాగుతున్నాయని భదౌరియా చెప్పారు.