
దంతాలపల్లి : ‘అమ్మా నాన్నా.. మళ్లీ మీ ముందు ఓడిపోయా.. అందరి ముందు ప్రశ్నగా మిగిలిపోయా.. పెద్దమనుషుల సమక్షంలో మళ్లీ ఆరు నెలలు గడువు పెడితే తనను నమ్మి మరోసారి ఓడిపోయా.. ఏం చేయాలో అర్థం కావట్లేదు.. నాకు బతకాలని లేదు’ అంటూ లేఖ రాసి ఓ woman ఉరివేసుకుని suicideకు పాల్పడిన ఘటన mahabubabad జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారం లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
మృతురాలి కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దముప్పారం గ్రామానికి చెందిన పోలేపల్లి వెంకన్న-శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె శరణ్య (22) ఇంటర్మీడియట్ చదివింది. కుట్టు మిషన్ నేర్చుకుని ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని love చేసింది. కొండ లింగమల్లు అనే ఆ యువకుడు ఓ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తూ, కారు డ్రైవర్గా పని చేస్తున్నాడు.
marriage చేసుకునే క్రమంలో వీరి మధ్య సమస్య తలెత్తింది. దీంతో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఆ యువకుడు పెళ్లి చేసుకునేందుకు మరో ఆరు నెలల గడువు పెట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురి అయింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో.. ప్రేమించి మోసపోయి.. ఓడిపోయాను అంటూ సదరు యువకుడి ఊహా చిత్రానికి గీసి లేఖ రాసిపెట్టింది. ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లేఖను, ఆత్మహత్యకు వినియోగించిన చున్నీని స్వాధీనం చేసుకున్నారు.
యువకుడి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళన..
యువతి మృతికి ప్రేమించిన యువకుడే కారణం అంటూ, బాధిత కుటుంబానికి న్యాయం చేసి బాధ్యులైన యువకుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు మృతదేహంతో యువకుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. యువతి మృతిపై తమకు లిఖితపూర్వక ఫిర్యాదు అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై మురళీధర్ రాజు తెలిపారు. పరిస్థితిని సీఐ కరుణాకర్ పర్యవేక్షిస్తున్నారు.
కాగా, ఇలాంటి ఘటనే జగిత్యాలలో చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త extra dowry తేవాలని వేధించడంతో ఓ married women కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్కు చెందిన కాంపెళ్లి మమత (24), రమేష్ లు ప్రేమించుకోగా 2018లో పెద్దలసమక్షంలో వివాహం జరిపించారు. పెళ్లయిన ఏడాదిన్నరకి పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. కొన్నాళ్లకు harrasement మొదలయ్యాయి. దీంతో మమత సోమవారం రాత్రి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోగా తీవ్రగాయాలయ్యాయి. మొదట జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది.
దీంతో కోపోద్రిక్తులైన మృతురాలి బంధువులు జగిత్యాల వచ్చి పాత బస్టాండ్ ఎదురుగా మధ్యాహ్నం మృతదేహంతో ఆందోళనకు దిగారు. గంటసేపు ఆందోళన చేయగా డి.ఎస్.పి ఆర్ ప్రకాష్, పట్టణ సీఐ కే కిషోర్ వారితో మాట్లాడి ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చినప్పటికీ అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా మమత భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. తన కుమార్తె మమత అత్తమామలు రాజవ్వ, లక్ష్మణ్. భర్త రమేష్, బావ మహేష్ కిరోసిన్ పోసి నిప్పంటించి హతమార్చారని మమత తల్లి నక్క సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.