ఇంటర్ బోర్డుకి సమాంతరంగా మరో కమీషనర్ వ్యవస్థ నడుస్తోంది.. బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు

Published : Jan 30, 2023, 05:06 PM IST
ఇంటర్ బోర్డుకి సమాంతరంగా మరో కమీషనర్ వ్యవస్థ నడుస్తోంది.. బోర్డు  కార్యదర్శి నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డు కార్యాలయంలోని సీసీ కెమెరాలను ట్యాంపర్ చేశారని ఆరోపించారు.  

ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్‌ పేపర్ల ఆన్‌లైన్ వాల్యుయేషన్‌తో పారదర్శకత ఉంటుందని అన్నారు.  ఏసీబీ, అట్రాసిటీ, లైంగిక వేధింపులు తదితర క్రిమినల్ కేసుల కారణంగా సస్పెండైన ఒక జూనియర్ లెక్చరర్ బోర్డు అధికారులపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. సోమవారం నవీన్ మిట్టల్ మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ బోర్డుకి సమాంతరంగా మరో కమీషనర్ వ్యవస్థ నడుస్తోందన్నారు. ఒక వ్యక్తి వ్యవస్థను పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నారని ఆరోపించారు.

బోర్డు కార్యాలయంలోని సీసీ కెమెరాలను ట్యాంపర్ చేశారని ఆరోపించారు. తాను ఓ అధికారితో మాట్లాడిన విషయాలు మూడో వ్యక్తికి వెంటనే తెలిసిపోతున్నాని అన్నారు. సీసీ కెమెరాల పాస్ వర్డ్ కూడా ప్రస్తుతం ఉద్యోగంలో లేని వ్యక్తి రన్ చేస్తున్నారని తెలిపారు. మాన్యువల్ వాల్యువేషన్ ద్వారా డబ్బులు సంపాదించే వారే ఆన్‌లైన్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇంటర్ బోర్డులో డాటా చోరి అయిందని చెప్పారు. ఇందుకు సంబంధించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నవీన్ మిట్టల్ తెలిపారు.

ఆన్‌లైన్ వాల్యువేషన్ వల్ల ఖర్చు, పనిభారం తగ్గుతుందని అన్నారు. ఈ విధానం వల్ల రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కూడా సులభంగా చేయవచ్చని అన్నారు. ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌ విధానంపై కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్