‘‘ మంత్రి ఎప్పుడవుతున్నారు ’’ అంటూ కేటీఆర్.. ‘‘ ఇరికించొద్దంటూ ’’ రాజగోపాల్ రెడ్డి, అసెంబ్లీలో సరదా ముచ్చట

By Siva KodatiFirst Published Feb 8, 2024, 6:47 PM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా..లేక కొడుకు సంకీర్త్ పోటీ చేస్తున్నాడా అని కేటీఆర్ అడగ్గా తనను కాంట్రవర్సీల్లోకి లాగొద్దని రాజగోపాల్ రెడ్డి కోరారు. 

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ ఆవరణలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీకు మంత్రి పదవి ఎప్పుడొస్తుందని కోమటిరెడ్డిని కేటీఆర్ అడగ్గా.. మీలాగే మాపైనా ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని రాజగోపాల్ రెడ్డి ఆన్సర్ ఇచ్చారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ.. ఫ్యామిలీ పాలన కాదు, బాగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయన్నారు. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా..లేక కొడుకు సంకీర్త్ పోటీ చేస్తున్నాడా అని కేటీఆర్ అడగ్గా తనను కాంట్రవర్సీల్లోకి లాగొద్దని రాజగోపాల్ రెడ్డి కోరారు. 

కాగా.. త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ వుండే అవకాశాలు వున్నాయంటూ మీడియాలోనూ, కాంగ్రెస్ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మరో ఆరుగురికి ఛాన్స్ వుండటంతో సీనియర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ సైతం చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయానికి వస్తే.. నల్గొండ నుంచి గెలిచిన వెంకట్ రెడ్డికి ఆల్రెడి మంత్రిగా బెర్త్ దొరికింది.

Latest Videos

రాజగోపాల్ రెడ్డి సైతం కేబినెట్‌లో చేరాలని ఉవ్విళ్లూరుతున్నారు. సామాజికంగా, ఆర్ధికంగా బలమైన కుటుంబం కావడంతో పాటు అధిష్టానం వద్ద పరపతి వుండటంతో వీరికి మరో ఛాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే ఒక కుటుంబానికి ఒకే పదవి అనే రూల్ పెడితే మాత్రం.. రాజగోపాల్ రెడ్డి ఆశలు గల్లంతే. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. 

click me!