మిమల్ని తైవాన్‌కు ఆహ్వానిస్తున్నాను.. మా పార్క్ ఏర్పాటుకు కట్టుడి ఉన్నాం: కేసీఆర్‌కు ఫాక్స్ కాన్ చైర్మన్ లేఖ

Published : Mar 06, 2023, 12:18 PM IST
మిమల్ని తైవాన్‌కు ఆహ్వానిస్తున్నాను.. మా పార్క్ ఏర్పాటుకు కట్టుడి ఉన్నాం: కేసీఆర్‌కు ఫాక్స్ కాన్ చైర్మన్ లేఖ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లీయూ లేఖ రాశారు. తాను హైదరాబాద్‌లో పర్యటించిన కేసీఆర్ ఇచ్చిన అతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ యంగ్ లీయూ లేఖ రాశారు. తాను హైదరాబాద్‌లో పర్యటించిన కేసీఆర్ ఇచ్చిన అతిథ్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు భారతదేశంలో ఇప్పుడు కొత్త స్నేహితుడు ఉన్నాడని.. కేసీఆర్‌ను తైవాన్‌కు ఆహ్వానిస్తున్నట్టుగా తెలిపారు. కేసీఆర్ తన పర్సనల్ గెస్ట్ అని పేర్కొన్నారు. ఇటీవల సమావేశంలో చర్చించినట్టుగానే కొంగర కలాన్‌లో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌ కాన్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కొంగర కలాన్‌‌లో తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా ధ్రువీకరించారు.

‘‘మా హైదరాబాద్ పర్యటన సందర్భంగా నాకు, నా బృందానికి మీరు అందించిన ఆతిథ్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము హైదరాబాద్‌లో ఉన్న సమయంలో అద్భుతమైన సమయాన్ని గడిపాము. మీరు తెలిపిన హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు, అందించిన పర్సనలైజ్‌డ్ కార్డ్‌కి కూడా నేను మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ పరివర్తన, అభివృద్ధికి మీ దార్శనికత, ప్రయత్నాల నుంచి తాను నిజంగా ప్రేరణ పొందాను. నాకు ఇప్పుడు భారతదేశంలో కొత్త స్నేహితుడు ఉన్నారు. భవిష్యత్తులో మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను.

మార్చి 2వ తేదీన జరిగిన మన సమావేశంలో మీతో చర్చించినట్లుగా.. కొంగర కలాన్‌లో మా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉంది వీలైనంత త్వరగా కొంగర కలాన్ పార్క్‌ను ప్రారంభించడంలో మీ బృందం మద్దతును కోరుతున్నాను. నా వ్యక్తిగత అతిథిగా మిమ్మల్ని తైవాన్‌కు ఆహ్వానించడానికి కూడా నేను ఈ అవకాశాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. తైపీలో మీకు ఆతిథ్యం ఇవ్వడం నా గౌరవం.త్వరలో మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాను’’ అని లేఖలో యంగ్ లీయూ పేర్కొన్నారు. 

ఇక, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రసిద్ది చెందిన ఫాక్స్ కాన్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబందించి ఫాక్స్ కాన్ ప్రతినిధి బృందం మార్చి 2వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సమావేశంలో ఫాక్స్ కాన్ సంస్థ చైర్మన్ యంగ్ ల్యూ స్వయంగా పాల్గొన్నారు. ఫాక్స్ కాన్ తయారీ కేంద్రం ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇక, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన టీ వ‌ర్క్స్‌ను కూడా యంగ్ లీయూ ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం