ఇంటర్ పరీక్ష రాస్తూ.. విద్యార్థి మృతి

Published : Mar 02, 2019, 01:55 PM IST
ఇంటర్ పరీక్ష రాస్తూ.. విద్యార్థి మృతి

సారాంశం

నాలుగు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే.

నాలుగు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు మొదలైన సంగతి తెలిసిందే. కాగా... ఓ ఇంటర్ విద్యార్థి పరీక్ష రాస్తూ.. ఎగ్జామ్ హాల్ లోనే కన్నుమూశాడు. ఈ విషాద సంఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది.

శనివారం ఇంటర్‌ పరీక్ష రాస్తూ గోపిరాజ్‌ అనే విద్యార్థి మృతి చెందాడు. ప్యారడైజ్‌ సమీపంలోని శ్రీ చైతన్య కళాశాలలో ఈ విషాదం నెలకొంది. విద్యార్థి గోపిరాజ్‌ పరీక్ష రాస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సిబ్బంది హుటాహుటిన విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు. 

అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే.. విద్యార్థి ఎలా మృతిచెందాడు అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.