హరీష్ రావు పని ఖతమ్: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published : Mar 02, 2019, 01:18 PM IST
హరీష్ రావు పని ఖతమ్: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

నమ్మినవాళ్లను నట్టేటముంచడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటేనని రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్‌కు సిద్దిపేట ఈసారే ఆఖరని, మరోసారి టికెట్ రాదని ఆయన జోస్యం చెప్పారు. 

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో సిద్ధిపేట శాసనసభ్యుడు హరీష్‌రావుకు కాలం చెల్లినట్లేనని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. ఓ కేసుకు సంబంధించి సిద్దిపేట కోర్టుకు ఆయన శనివారం హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

నమ్మినవాళ్లను నట్టేటముంచడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అలవాటేనని రేవంత్ రెడ్డి అన్నారు. హరీశ్‌కు సిద్దిపేట ఈసారే ఆఖరని, మరోసారి టికెట్ రాదని ఆయన జోస్యం చెప్పారు. 16మంది ఎంపీలుంటే ఏదో వెలగబెడతామంటున్నారని ఆయన కెసీఆర్ పై వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు ఉన్న ఎంపీలతో ఏం సాధించారని  ఆయన ప్రశ్నించారు. 

కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చారా, విభజన హామీలు సాధించారా అని రేవంత్ అడిగారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలు రాహుల్‌ వర్సెస్‌ మోడీగానే కొనసాగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

PREV
click me!

Recommended Stories

Harish Rao: హ‌రీశ్‌రావు ఫోన్ కూడా ట్యాప్ చేశారా.? ఏడున్న‌ర గంట‌ల విచార‌ణ‌లో ఏం తేలిందంటే
IMD Fog Alert : అధికపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఫాగ్ సైక్లోన్ కొనసాగుతోందా..? ఈ 12 జిల్లాలకు హైఅలర్ట్