దోపిడికి అడ్డొస్తే చంపేయడమే: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Siva Kodati |  
Published : Aug 29, 2020, 05:34 PM IST
దోపిడికి అడ్డొస్తే చంపేయడమే: హైదరాబాద్‌లో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

సారాంశం

10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు. వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు.

10 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు.

వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సజ్జనార్ చెప్పారు. గతంలోనే వీరిపై పలు కేసులు నమోదయ్యాయని.. తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు వీలుగా వీరంతా జగద్గిరిగుట్ట అంబేద్కర్ కాలనీలో షెల్టర్ తీసుకున్నారని సజ్జనార్ చెప్పారు.

ముందుగా చోరీకి పాల్పడే ప్రాంతంలో రెక్కీ నిర్వహిస్తారని, నేరాలు చేసే సమయంలో ఆయుధాలు ఉపయోగిస్తారని సీపీ పేర్కొన్నారు. చోరీ సమయంలో ఎవరైనా అడ్డొస్తే వారిని చంపేందుకైనా వెనుకాడరని సజ్జనార్ వెల్లడించారు. వీరిపై ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో వీరి నేరాలపై ఇంకా విచారించాల్సి వుందని ఆయన తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?