కరీంనగర్ ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం (వీడియో)

Published : Aug 29, 2020, 11:07 AM ISTUpdated : Aug 29, 2020, 11:12 AM IST
కరీంనగర్ ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం (వీడియో)

సారాంశం

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది.చెత్తా చెదారం పేరుకపోవడంతో చెత్తనంతా ఒక చోటకు చేర్చి నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు పైకి లేచాయి. 

కరీంనగర్: తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ట్రాన్స్ కో సబ్ స్టేషన్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలక్ట్రిసిటీ క్యాంపస్ లోని స్పోర్ట్స్ సెంటర్  సమీపంలో మంటలు చెలరేగాయి. చెత్తా చెదారం పేరుకపోవడంతో చెత్తనంతా ఒక చోటకు చేర్చి నిప్పు పెట్టడంతో ఒక్కసారిగా మంటలు పైకి లేచాయి. 

హుటాహుటిన ఫైర్ ఇంజన్లను ఘటన స్థలానికి రప్పించి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్, జగిత్యాల హైవేపై ఉన్న సబ్ స్టేషన్ కావడంతో ప్రమాదం తీవ్రతరం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. 

సమీపంలోనే నివాసాలతో పాటు వాణిజ్య సముదాయాలు కూడా ఉండడంతో ట్రాన్స్ కో అధికారుల, ఫైర్ డిపార్ట్ మెంట్ యంత్రాంగం మంటలను కట్టడి చేసే పనిలో నిమగ్నం అయ్యారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంకలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

"

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!