మామూలోడు కాడు: కీసర మాజీ తాహిసిల్దార్ కేసులో సంచలన విషయాలు

By telugu teamFirst Published Aug 29, 2020, 12:49 PM IST
Highlights

కోటీ 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన కీసర మాజీ తాహిసిల్దార్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసు స్ఠేషన్లలో ఉండాల్సిన ఎఫ్ఐఆర్ కాపీలు నాగరాజు వద్ద లభించాయి.

హైదరాబాద్: కోటీ 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కీసర మాజీ తాహిసిల్దార్ నాగరాజు కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. మూడు రోజులతో పాటు నాగరాజు సహా నలుగురు నిందితులను ఏసీబీ అధికారులు విచారించారు. విచారణలో వారు ఏ మాత్రం సహకరించలేదని తెలుస్తోంది.

నాగరాజు నివాసంలో స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఎఫ్ఐఆర్ కాపీలు లభించాయి. పోలీసు స్టేషన్లలో ఉండాల్సిన ఎఫ్ఐఆర్ కాపీలు నాగరాజు వద్దకు ఎలా వచ్చాయనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ కాపీలతో నాగరాజుకు ఏం పని అనే ప్రశ్నకు సమాధానం రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు 

Also Read: రూ.1.10 కోట్ల లంచం తీసుకొన్న కీసర తహసీల్దార్ నాగరాజు: గిన్నిస్ బుక్ ‌రికార్డ్స్‌లో చోటుకు ధరఖాస్తు

నాగరాజు వద్ద సీజ్ చేసినవాటిలో భూపత్రాలు, పహణీలు, సేల్ డీడ్స్, పాసు పుస్తకాలు ున్నాయి. సేల్ డీడ్స్, పహణీల్లో పేర్లున్న వ్యక్తులను విచారించాలని ఏసీబి అధికారులు భావిస్తున్నారు. నాగరాజు కేసులో సాంకేతిక అంశాలు కీలకంగా మారాయి. నిందితుల సెల్ ఫోన్లలో సమాచారం నిక్షిప్తమై ఉన్నట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

వారి సెల్ ఫోన్లను సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించనున్నారు. నాగరాజుకు పోలీసులతో సన్నిహిత సంబంధాలు ున్నట్లు అనుమానిస్తున్నారు. 28 ఎకరాల వివాదాస్పదమైన భూమిని వేరేవారికి కట్టబెట్టేందుకు సిద్ధపడి కోటీ 10 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అతనితో పాటు మరో ముగ్గురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 

Also Read: కీసర తహసీల్ధార్‌కి, శ్రీనాథ్ యాదవ్ కి మధ్య నాగరాజు మధ్యవర్తిత్వం: ఏసీబీ రిమాండ్ రిపోర్టు

click me!