హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య...

Published : Dec 29, 2023, 08:12 AM IST
హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య...

సారాంశం

లేజీ యాజమాన్యం చదువుల ఒత్తిడి వల్లే వర్ష ఆత్మహత్య చేసుకుందని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

హైదరాబాద్ : చదువుల ఒత్తిడి మరో విద్యార్థిని బలి తీసుకుంది. హైదరాబాద్ పీర్జాదిగూడ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.  ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న వర్ష బాత్రూంలో చున్నితో ఉరి వేసుకునే ఆత్మహత్య చేసుకుంది.  వర్షా స్వగ్రామం విపన్న గుండ్ల గ్రామం. కాలేజీ యాజమాన్యం చదువుల ఒత్తిడి వల్లే వర్ష ఆత్మహత్య చేసుకుందని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

శ్రీ చైతన్య కాలేజీ ముందు విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. వారికి సమాచారం ఇవ్వకుండానే వర్ష మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకుందని, దీనిమీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Konda Surekha: నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక అదిష్టానం ఇష్టం.. కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు
Rain Alert: తెలంగాణలో వింత పరిస్థితి.. ఉదయం ఎండ రాత్రి వర్షం. ఈ జిల్లాలకు రెయిన్ అలర్ట్