జూన్ 20 లోపుగా ఇంటర్ పరీక్ష ఫలితాలు: తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్

By narsimha lodeFirst Published May 19, 2022, 4:55 PM IST
Highlights


ఈ ఏడాది జూన్ 20 లోపుగా ఇంటర్ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తామని తెలంగాన ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ జలీల్  తెలిపారు. గత ఏడాది మాదిరిగానే వాల్యూయేషన్ ను కూడా పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు.

హైదరాబాద్: ఈ ఏడాది జూన్ 20 లోపుగా ఇంటర్ పరీక్ష ఫలితాలను వెల్లడించనున్నట్టు Telangana ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ప్రకటించారు. ఇవాళ్టితో ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తైన విషయం తెలిసందే.గురువారంనాడు తన కార్యాలయంలో  Omer Jaleel మీడియాతో మాట్లాడారు. Intermediate పరీక్షల్లో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయన్నారు. భవిష్యత్తులో జరిగే పరీక్షల్లో ఈ పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటామని ఆయన ప్రకటించారు. 

Telugu, ఇంగ్లీష్ మీడియంలలో వేర్వేరు ప్రశ్నలు వచ్చాయన్నారు. ఈ ప్రశ్నల్లో  ఏ ప్రశ్నకు జవాబు రాసినా కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. విద్యార్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.ఎలాంటి వాల్యూ యేషన్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుపుతామన్నారు.

ఈ నెల 11న ఇంటర్ ఫస్టియర్ హిందీ మీడియం విద్యార్థులకు ఫస్ట్ ఇయర్ పొలిటికల్‌ సైన్స్‌ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు బోర్డు ద్వారా ప్రింట్ అయిన ప్రశ్నపత్రాలు ఇవ్వకుండా చేతితో రాసిన క్వశ్చన్ పేపర్స్ ఇచ్చారు. హైదరాబాద్‌, నిజామాబాద్  లలోని విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. ఫస్ట్ ఇయర్‌కు 32 మంది, సెకండ్ ఇయర్‌కు 24 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 

 హిందీ మీడియం పేపర్లు లేకపోవడంతో ఇంగ్లీష్ మీడియం పేపర్లను ట్రాన్స్ లేటర్ తో హిందీలో రాయించారు. దాన్ని జీరాక్స్ తీయించి విద్యార్థులకు ఇచ్చారు. అయితే విద్యార్థులకు చేతిరాత సరిగా అర్థం కాకపోవడంతో సమయం వృథా అవుతోందని ఆవేదన చెందారు. ఇలా చేతితో రాసి ఇస్తామని ఆయా ప్రిన్సిపాళ్లకు గత మార్చిలోనే సమాచారం ఇచ్చామని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఆప్షనల్‌ సబ్జెక్టుల పేపర్లనూ ఇలానే ఇస్తామని పేర్కొన్నారు. 

also read:మణుగూరు ఇంటర్ పరీక్షా కేంద్రంలో తేనేటీగల దాడి: ఇద్దరు విద్యార్ధులకు గాయాలు

ఇకపోతే  తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 6 నుంచి మొదలయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సరం సంస్కృతంలో రెండు ప్రశ్నలు రిపీటవ్వడంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. మరుసటిరోజు జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో రెండో ఏడాది సంస్కృతం బదులు హిందీ పేపర్‌ ఇచ్చారు. మరొకరికి హిందీకి బదులు సంస్కృతం ప్రశ్నాపత్రం ఇచ్చారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఈ నెల 6న ప్రారంభమయ్యాయి.  రాష్ట్రంలోని 1443 పరీక్షా కేంద్రాల్లో 9.07 లక్షల మంది విద్యార్ధులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు.. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు.. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా కూడా ఇంటర్ పరీక్షా కేంద్రంలోకి విద్యార్ధులను అనుమతించలేదు..

గత ఏడాది నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ లో 51 శాతం మంది విద్యార్ధులు ఫెయిలయ్యారు. ఫెయిలైన విద్యార్ధులను ప్రభుత్వం పాస్ చేసింది. అయితే ప్రస్తుతం ఆ విద్యార్ధులు సెకండియర్ లో ఉన్నారు. సెకండియర్ పరీక్షలతో పాటు ఫస్టియర్ పరీక్షలకు సంబంధించి ఇంఫ్రూవ్ మెంట్ రాసుకొనే వెసులుబాటును కల్పించింది. ఇంఫ్రూవ్ మెంట్ రాసిన విద్యార్ధులకు ఎక్కువగా వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకొంటారు. 

click me!