ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సోమవారం రోజు కరోనా వైరస్ పై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆరోగ్యశాఖకు చెందిన అధికారులతో తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది అనే అంశం నుంచి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపారు.
దేశమంతా రెండవదఫా విధించిన లాక్ డౌన్ ఆదివారంతో ముగిసింది. నిన్న సోమవారం నుంచి మూడవదఫా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ మూడవదఫా ;లాక్ డౌన్ లో భారీస్థాయిలో సడలింపులు ఇచ్చారు అని చెప్పవచ్చు.
తెలంగాణాలో మాత్రం మే7వ తేదీవరకు లాక్ డౌన్ కొనసాగనున్న విషయం తెలిసిందే. కానీ కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల గురించి ఒకటే చర్చ జరగడం, తెలంగాణాలో 7 వరకు లాక్ డౌన్ సడలింపులు లేవు అని ప్రభుత్వం మరొక్కమారు గుర్తుచేయకపోవడంతో... కొందరు ప్రజలు సందిగ్ధతకు కూడా లోనయ్యారు. బయట చాలా ప్రదేశాల్లో ఇది కనబడింది.
undefined
ఇకపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సోమవారం రోజు కరోనా వైరస్ పై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆరోగ్యశాఖకు చెందిన అధికారులతో తెలంగాణాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది అనే అంశం నుంచి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపారు.
ఈ చర్చల్లో అధికారులు జంటనగరాల పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉందని వారు విన్నవించారు. కేసులు ఈ ప్రాంతాల్లో అధికంగా నమోదవుతున్నందున... ఇక్కడ లాక్ డౌన్ లో ఎటువంటి సడలింపులు ఇవ్వకుండా,మరింత కఠినంగా అమలు చేయాలని నివేదించారు.
ఇక ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కేబినెట్ సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ కేబినెట్ భేటీలో ఆయన లాక్ డౌన్ విషయంలో అంతిమ నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణలో కరోనా కేసులు సోమవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కొత్తగా ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1,085కి చేరింది.
సోమవారం నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇవాళ 40 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 585కి చేరింది. వైరస్ కారణంగా మొత్తం 29 మంది ప్రాణాలు కోల్పోగా.. 471 మంది చికిత్స పొందుతున్నారు.
హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేశారు. వనస్థలిపురంలో ఎనిమిది కాలనీలను కంటైన్మెంట్ జోన్లుగా మార్చారు.
ఆదివారం వనస్థలిపురంలోని మూడు కుటుంబాల్లో 9 మందికి కరోనా వైరస్ సోకింది. వీరిని ఆసుపత్రికి తరలించారు. హుడా సాయినగర్, సుష్మా సాయినగర్, కమలానగర్, రైతుబజార్, సాహెబ్ నగర్ రోడ్డు, ఏబీ టైప్ కాలనీలు, ఎస్ కే డీ నగర్, ఫేజ్ 1 కాలనీ, సచివాలయనగర్ లను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించారు.