పోలీసులు డైరెక్ట్‌గా బెడ్‌రూంలోకి వచ్చేశారు...జీపీ రెడ్డి కుమార్తె

sivanagaprasad kodati |  
Published : Nov 09, 2018, 09:22 AM IST
పోలీసులు డైరెక్ట్‌గా బెడ్‌రూంలోకి వచ్చేశారు...జీపీ రెడ్డి కుమార్తె

సారాంశం

పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రముఖ పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి కుమార్తె శైలజ..తన ఇంట్లో పోలీసుల సోదాలపై మీడియాతో మాట్లాడిన ఆమె రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు ఇంట్లోకి వచ్చారని.. అప్పుడే మేం భోజనం చేయబోతున్నామని తెలిపారు. ఏ స్టేషన్ నుంచి వచ్చారు

పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ప్రముఖ పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి కుమార్తె శైలజ..తన ఇంట్లో పోలీసుల సోదాలపై మీడియాతో మాట్లాడిన ఆమె రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు ఇంట్లోకి వచ్చారని.. అప్పుడే మేం భోజనం చేయబోతున్నామని తెలిపారు.

ఏ స్టేషన్ నుంచి వచ్చారు.. ఎందుకు వచ్చారు అని అడుగుతుంటే ఒక్కరు కూడా సరైన సమాచారం ఇవ్వలేదని శైలజ అన్నారు. నాన్న లోపల నిద్రపోతున్నారని.. మేం చెప్పేది వినకుండా బెడ్‌రూంలోకి వచ్చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కరు కూడా సరైన సమాధానం ఇవ్వకపోయే సరికి తాను మా నాన్న ఫ్రెండ్ రాజగోపాల్‌కి ఫోన్ చేశానని శైలజ వెల్లడించారు.

తమ ఇంటికి పోలీసులు రావడం వెనుక ఐజీ నాగిరెడ్డి హస్తం ఉందని.. కొందరు తమకు చెందిన ల్యాండ్‌ను రాయాల్సిందిగా నాన్నపై ఏడాదిన్నరగా ఒత్తిడి చేస్తున్నారని.. వారికి నాగిరెడ్డి సాయం చేస్తున్నారని శైలజ ఆరోపించారు. పోలీసులంటే తనకు చాలా గౌరవమని.. కాని కొందరి వల్ల ఆ నమ్మకం పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు...పోలీసులతో లగడపాటి జగడం

ల్యాండ్ వివాదం...బెదిరించి కాజేయాలని చూస్తున్నారు: జీపీ రెడ్డి

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?