ల్యాండ్ వివాదం...బెదిరించి కాజేయాలని చూస్తున్నారు: జీపీ రెడ్డి

By sivanagaprasad kodatiFirst Published Nov 9, 2018, 8:43 AM IST
Highlights

ప్రముఖ పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి ఇంటిలో అర్థరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించడం సంచలనం కలిగించింది. ఓ సివిల్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు.

ప్రముఖ పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి ఇంటిలో అర్థరాత్రి పోలీసులు సోదాలు నిర్వహించడం సంచలనం కలిగించింది. ఓ సివిల్ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు అక్కడికి చేరుకున్నారు. ఈ సోదాలపై ఆయన స్పందించారు.

ఓ భూమి వ్యవహారంలో పలువురితో వివాదాలున్నాయని.. కొందరికి న్యాయం చేయాలని సహాయం చేస్తున్నందుకు తనపై కక్ష కట్టారని ఆయన వెల్లడించారు. ల్యాండ్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ తన లాయరే చూసుకుంటున్నారన్నారు..

అందుకు సంబంధించిన పత్రాలన్నీ ఒరిజనల్‌వేనని ఇద్దరు కలెక్టర్లు ధ్రువీకరించారని జీపీ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 20 సార్లు విచారణకు హాజరయ్యానని... పోలీసులు తన ఇంటికి రావాల్సిన అవసరం ఏంటని ఆయన ప్రశ్నించారు.

మరోవైపు జీపీ రెడ్డి ఇంట్లో సోదాలకు సంబంధించి సమాచారం అందుకున్న ఆయన మిత్రుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అక్కడికి చేరకున్నారు.. పోలీసుల తీరును తప్పుబట్టిన ఆయన సెర్చ్ వారెంట్ లేకుండా.. అర్థరాత్రి పూట ఇళ్లలోకి చొరబడి సోదాలు చేయమని చట్టం చెప్పిందా అని ప్రశ్నించారు.

పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు...పోలీసులతో లగడపాటి జగడం
 

click me!