పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు...పోలీసులతో లగడపాటి జగడం

sivanagaprasad kodati |  
Published : Nov 09, 2018, 07:30 AM ISTUpdated : Nov 09, 2018, 10:41 AM IST
పారిశ్రామికవేత్త జీపీ రెడ్డి ఇంట్లో సోదాలు...పోలీసులతో లగడపాటి జగడం

సారాంశం

ప్రముఖ పారిశ్రామిక వేత్త జీపీ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.65లోని ఆయన నివాసంలో అర్థరాత్రి వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. 

ప్రముఖ పారిశ్రామిక వేత్త జీపీ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెం.65లోని ఆయన నివాసంలో అర్థరాత్రి వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు.

 సివిల్ కేసుకు సంబంధించిన విచారణంటూ పోలీసులు హల్‌చల్ చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ చూపించకుండా ఇంట్లోకి వచ్చారు. మరోవైపు జీపీ రెడ్డి ఇంట్లో తనిఖీల విషయం తెలుసుకున్న ఆయన మిత్రుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అక్కడికి చేరుకుని.. పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

సెర్చ్ వారెంట్ లేకుండానే తన మిత్రుడిని ఇబ్బంది పెడుతున్నారంటూ అభ్యంతరం తెలిపారు. ఐపీఎస్ అధికారి నాగిరెడ్డికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని.. పాత కేసును పట్టుకుని అర్థరాత్రి వేళ పోలీసులు హడావిడి చేశారంటూ ధ్వజమెత్తారు.

అర్థరాత్రి ఇళ్లలో చొరబడి సోదాలు చేయమని చట్టం చెబుతుందా..? అని లగడపాటి ప్రశ్నించారు. పోలీసుల వైఖరిపై గవర్నర్, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని రాజగోపాల్ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం