మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు.. మల్లారెడ్డి

Published : Feb 19, 2019, 12:01 PM IST
మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు.. మల్లారెడ్డి

సారాంశం

తాను మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు.

తాను మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తెలిపారు. తనపై నమ్మకంతో తనకు ఇంత పెద్ద బాధ్యతను అప్పగించిన కేసీఆర్ కి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అత్యధిక మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలు జరిగి దాదాపు రెండు నెలలకు మంత్రి వర్గ విస్తరణ  చేపట్టారు. ఈ మంత్రి వర్గ విస్తరణలో చామకూర మల్లారెడ్డికి కేసీఆర్ చోటు కల్పించారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

మంత్రి అవుతానని కలలో కూడా అనుకోలేదని, కేసీఆర్‌కు ఎప్పటికీ విధేయత కలిగివుంటానని అన్నారు. చిన్నప్పటి నుంచి పేదల కోసం కష్టపడి పనిచేసినట్టు వెల్లడించారు. తనకు మంత్రి పదవి దక్కడమే ఎక్కువని, ఏ శాఖ అప్పగించినా సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపతానని, బంగారు తెలంగాణ సాధనకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

PREV
click me!

Recommended Stories

Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు
హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?