తెలంగాణ బస్సే నడుపుతానంటున్న దేశంలోని తొలి మహిళా డ్రైవర్

First Published Mar 3, 2017, 11:17 AM IST
Highlights

ఇప్పుడామె ఢిల్లీని వదిలేసి తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులో డ్రైవర్ గా పనిచేయాలనుకుంటున్నారు.

ఈమె పేరు సరిత... మన తెలంగాణ బిడ్డే అయినా మనకు మాత్రం ఆమె గురించి పెద్దగా తెలియదు. అదే దేశ రాజధాని వాసులకు మాత్రం ఆమె బాగా పరిచయం. దేశంలోనే తొలి మహిళా డ్రైవర్ గా సరిత రికార్డు సృష్టించింది.

 

నల్గొండ జిల్లాలోని సంస్థాన్ నారాయణపురానికి చెందిన సరిత  ప్రస్తుతం ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు.

 

ఆటో డ్రైవర్‌గా కెరీర్ ప్రారంభించిన సరిత గత ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా విమెన్స్ అచీవర్స్‌తో సహా పలు అవార్డులు అందుకున్నారు.

 

మొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్‌బేడీ చేతుల మీదుగా విమెన్ ఆఫ్ పవర్ అవార్డును కూడా అందుకున్నారు.

 

ఇప్పుడామె ఢిల్లీని వదిలేసి తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులో డ్రైవర్ గా పనిచేయాలనుకుంటున్నారు.

 

ఈ రోజు ఆమె రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డిని సచివాలయంలో కలిశారు. పేద కుటుంబం నుంచి వచ్చి స్వశక్తితో ఎదుగుతున్న తనకు ప్రభుత్వం ఆసరాగా నిలవాలని కోరారు.

 

టీఎస్ ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. రిత విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

click me!