
అమెరికాలో మరో ప్రవాస భారతీయుడిని అత్యున్నత పదవి వరించింది. ఇండియన్ అమెరికన్, మాజీ దౌత్యవేత్త వినయ్ తుమ్మలపల్లి (Vinay Thummalapally) యూఎస్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (USTDA)డిప్యూటీ డైరెక్టర్, ప్రధాన నిర్వహణ అధికారి నియమితులయ్యారు. ఈ మేరకు USTDA అధికారిక ప్రకటన చేసింది. ‘ప్రెసిడెంట్ బిడెన్ వినయ్ తుమ్మలపల్లిని యుఎస్‌టిడిఏ డిప్యూటీ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియమించారు. సెనేట్ ద్వారా డైరెక్టర్ ధ్రువీకరించబడే వరకు వినయ్ తుమ్మలపల్లి యుఎస్‌టిడిఏ యాక్టింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు’ అని యుఎస్‌టిఏ పేర్కొంది. విదేశాలతో అమెరికా వాణిజ్య అభివృద్దిలో యూఎస్‌టీడీఏ కీలక పాత్ర పోషిస్తోంది.
ఇక, యూఎస్‌టీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులైన వినయ్ తుమ్మలపల్లికి తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్స్ వినయ్ తుమ్మలపల్లి గారు’ అని Minister KTR ట్వీట్ చేశారు.
Also read: యాదాద్రి ఆలయానికి వైసీపీ జడ్పీటీసీ కిలో బంగారం విరాళం.. కేసీఆర్‌కు థాంక్స్
అంతకు ముందు.. వినయ్ తుమ్మలపల్లి యునైటెడ్ స్టేట్స్‌లో ఉద్యోగాలు సృష్టించే, వ్యాపార పెట్టుబడిని సులభతరం చేసే యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలోని SelectUSA ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2013 నుంచి 2017 వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగారు. ఇక, ఆయన అమెరికా అంబాసిడర్‌గా వ్యవహరించిన తొలి ఇండియన్ అమెరికన్‌గా చరిత్రలో నిలిచారు. 2009 నుంచి 2013 వరకు బెలిజ్‌లో యుఎస్ అంబాసిడర్‌గా కూడా పనిచేశాడు.
Also read: ఖుషీ నగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన మోదీ.. అక్కడి నుంచి తొలి ఫ్లైట్..
ఇక, హైదరాబాద్‌కు చెందిన వినయ్ 1974లో అమెరికా వచ్చారు. వినయ్ తండ్రి టీ ధర్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్సెస్ లేబొరేటరీలో శాస్త్రవేత్తగా పని చేశారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసేటప్పుడు వినయ్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రూమ్మేట్‌గా ఉన్నారు. ఒబామా హయాంలోనే వినయ్‌ను బెలిజ్‌కు అమెరికా రాయబారిగా నియమించారు.