మోడీ పాల‌న‌ పదేళ్లలో 30 ఏండ్ల ప్ర‌గ‌తి సాధించిన భార‌త్.. : ప‌వ‌న్ క‌ళ్యాణ్

Pawan Kalyan: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షంగా ఆ పార్టీ పోటీ చేయనుంది. కూకట్ పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ) స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
 


Telangana Assembly Elections 2023: హైదరాబాద్ లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో వేదిక‌ను పంచుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ప్ర‌ధాని పై ప్ర‌శంస‌లు కురిపించారు. మోడీ నాయకత్వంలో పదేళ్లలో భారతదేశం 30 ఏళ్ల ప్రగతిని సాధించింద‌ని కొనియాడారు. డీమోనిటైజేషన్, ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడం, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం, రామమందిర నిర్మాణం వంటి మోడీ మోడీ ప్రభుత్వ విజయాలను ప్ర‌స్తావించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)-జ‌న‌సేన‌లు క‌లిసి పోటీ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే  మంగళవారం హైదరాబాద్‌లో బీసీ ఆత్మ గౌర‌వ స‌భ‌ను నిర్వ‌హించాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్ కుమార్ స‌హా బీజేపీ కీల‌క నేత‌లు ఈ మీటింగ్ లో పాలుపంచుకున్నారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ప్ర‌ధానితో క‌లిసి వేదిక‌న‌ను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. బీజేపీ పాల‌న‌లో దేశంలో ఎంతో ప్ర‌గ‌తి సాధించింద‌ని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగాల నుంచి తాను మొదట స్ఫూర్తి పొందానని అన్నారు. ప్రధాని పదవికి ఆయనే సరిపోతారని అప్పుడే త‌న‌కు తెలిసిందని ప‌వ‌న్ పేర్కొన్నారు.

Latest Videos

బీజేపీ త‌మ మ‌ద్ద‌తును పున‌రుద్ఘాటిస్తూ త‌మ‌కు బీసీ ముఖ్య‌మంత్రి కావాల‌నీ, అందుకే బీజేపీకి బేషరతుగా మ‌ద్ద‌తు ఇచ్చామ‌ని తెలిపారు. కాగా, దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నారు. ఈ బహిరంగ సభకు హాజరుకావాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జీ.కిషన్‌రెడ్డి తనను ఆహ్వానించారనీ, ఆ ఆహ్వానాన్ని తాను అంగీకరించానని అంత‌కుముందు ప‌వ‌న్ చెప్పారు. అయితే, జ‌న‌సేన‌తో చేతులు కలపాలన్న పార్టీ నిర్ణయంపై పలువురు బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదన్నారు.

రాబోయే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తున్న నేప‌థ్యంలో బీజేపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య ఇప్ప‌టికే సీట్ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే జ‌న‌సేన మంగ‌ళ‌వారం తెలంగాణ ఎన్నిక‌ల బ‌రిలో నిలిపే 8 మంది అభ్య‌ర్థుల వివ‌రాలు ప్ర‌క‌టించింది.  కూకట్ పల్లి, తాండూరు, కోదాడ, నాగర్ కర్నూలు, ఖమ్మం, కొత్తగూడెం, వైరా (ఎస్టీ), అశ్వారావుపేట (ఎస్టీ) స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

జ‌న‌సేన అభ్యర్థుల వీరే.. 

కూకట్‌పల్లి- ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు- వేమూరి శంకర్ గౌడ్
కోదాడ- మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూల్- వంగ లక్ష్మ గౌడ్
ఖమ్మం- మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం- లక్కినేని సురేందర్ రావు
వైరా- డాక్టర్ తేజావత్ సురేందర్ రావు
అశ్వారావుపేట- ముయ్యబోయిన ఉమాదేవి

click me!