ఇండియా- ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్: స్కూల్ విద్యార్థులకు ఉచిత ప్రవేశం,లంచ్

By narsimha lode  |  First Published Jan 24, 2024, 8:57 PM IST

భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్  ను స్కూల్ విద్యార్థులు ఉచితంగా తిలకించే అవకాశం కల్పించింది హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్.


హైదరాబాద్: ఈ నెల  25వ తేదీన హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో  భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్  మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ఆరు నుండి 12 తరగతులు చదువుకునే విద్యార్ధులను స్టేడియంలోకి ఉచితంగా అనుమతించనున్నారు.  హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ మెయిల్ చేసిన స్కూల్ విద్యార్థులకు మాత్రమే  ఈ మ్యాచ్ ను ఉచితంగా  వీక్షించేందుకు అనుమతి ఉంటుంది.  స్టేడియంలోకి ఉచితంగా ప్రవేశంతో పాటు  మధ్యాహ్న భోజనం కూడ  హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందించనుంది. 

also read:హైద్రాబాద్ ఉప్పల్‌లో భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్: స్టేడియంలోకి ఇవి తీసుకెళ్లడం నిషేధం

Latest Videos

undefined

పాఠశాల స్థాయిలోనే విద్యార్థులను క్రీడల విషయంలో ప్రోత్సహించడం కోసం  భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య  జరిగే టెస్ట్ మ్యాచ్ కు  విద్యార్థులను ఉచితంగా  స్టేడియంలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా  హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది.

also read:భారత్, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్: హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్ ట్రాక్ రికార్డు ఇదీ..

ఆయా స్కూల్స్ నుండి   ఎంత మంది విద్యార్థులు వస్తున్నారు, ఎంత మంది సిబ్బంది వస్తున్నారనే వివరాలను  ధరఖాస్తులను హెచ్‌సీఏకి  పంపారు స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు. ఆయా స్కూల్స్ నుండి వచ్చిన  ధరఖాస్తుల ఆధారంగా ఆయా స్కూళ్లకు  కాంప్లిమెంటరీ పాసులను  హెచ్‌సీఏ పంపింది.ఆయా స్కూళ్లకు చెందిన యూనిఫారాలతో విద్యార్థులు రావాలని  హెచ్‌సీఏ సూచించింది.

 

click me!