బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి, పైళ్ల శేఖర్ రెడ్డిల నివాసాల్లో ఐటీ అధికారుల సోదాలు సాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్ రెడ్డి , పైళ్ల జనార్ధన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. మూడు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నెల 14వ తేదీన ఉదయం నుండి బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు ప్రజా ప్రతినిధుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. భువనగరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసాల్లో ఐటీ అలధికారులు సోదాలు చేస్తున్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో నిన్న ఉదయమే ఐటీ అధికారులు సోదాలు నిలిపివేశారు. కానీ భువనగిరి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేల నివాసాల్లో సోదాలు సాగుతున్నాయి.
undefined
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కి చెందిన వస్త్ర దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మర్రి జనార్ధన్ రెడ్డికి చెందిన ఇతర వ్యాపార సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.మరో వైపు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో పెట్టబుడులు పెట్టినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు ఈ సంస్థల లావాదేవీల గురించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
also red:హైద్రాబాద్‌లో ఐటీ సోదాలు: బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇళ్లలో రెండో రోజూ తనిఖీలు
ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లు కలిసి వ్యాపారం నిర్వహిస్తున్నారని ప్రచారం సాగుతుంది.
మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీలో ఈ ముగ్గురు భాగస్వామ్యులుగా ఉన్నారనే ప్రచారంలో ఉంది. ఈ సంస్థకు చెందిన పన్ను చెల్లింపులు, బ్యాలెన్స్ షీట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని చెబుతున్నారు.ఇవాళ సాయంత్రం వరకు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ఐటీ సోదాలు జరిగే ప్రాంతాల్లో కేంద్ర బలగాలు భద్రతను కల్పించాయి.
ఐటీ సోదాల తర్వాత కడిగిన ముత్యంలా బయటకు వస్తానని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నిన్న ప్రకటించారు. తాను ఇప్పటికే ఐటీ శాఖకు రూ. 150 కోట్ల పన్నులు చెల్లించినట్టుగా మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు.