హైద్రాబాద్ నగరంలోని పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుండి రియల్ ఏస్టేట్ సంస్థల్లో సోదాలు సాగుతున్నాయి.
హైదరాబాద్: నగరంలోని పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు గురువారంనాడు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న ఉదయం నుండి పలు రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.ఆదిత్య, సీఎస్ కే, ఊర్జిత , ఐరా రియల్ ఏస్టేట్ సంస్థల్లో ఆదాయపన్ను శాఖాధికారులు సోదాలు చేస్తున్నారు. ప్లాట్ల వివరాలపై అవకతవకలున్నాయని ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఆదిత్య రియల్ ఏస్టేట్ సంస్థకు చెందిన కార్యాలయాలతో పాటు ఆ సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. నిన్న ఉదయం నుండి సుమారు 50 ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్, విశాఖపట్టణం, బెంగుళూరు పట్టణాల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పలు రియల్ ఏస్టేట్ సంస్థలు సమర్పించిన ఆదాయపన్ను కు సంబంధించి అవకతవకలు గుర్తించినట్టుగా సమాచారం. ఆయా రియల్ ఏస్టేట్ సంస్థలు విక్రయించిన ప్లాట్ల విక్రయాల గురించి ఆదాయ పన్ను శాఖాధికారులు ఆరా తీస్తున్నారు.
ఐదేళ్లుగా ఐటీ రిటర్న్స్ కు సంబంధించి ఆదాయ పన్ను శాఖాధికారులు ఆరా తీస్తున్నారు. ఐదేళ్లుగా ఆయా రియల్ ఏస్టేట్ సంస్థలు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ ఆధారంగా అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఐదేళ్లలో ఆయా సంస్థలు నిర్వహించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. రెండు రోజులుగా నిర్వహిస్తున్న సోదాల్లో పలు సంస్థల్లో కీలక పత్రాలను ఐటీ అధికారులు సీజ్ చేశారని సమాచారం.