ఉద్యోగి చేతుల్లోంచి డబ్బు సంచి లాక్కుని పారిపోయిన గవర్నమెంట్ టీచర్.. రూ. 1.50లక్షలు చోరీ..

By SumaBala BukkaFirst Published Jan 19, 2023, 7:39 AM IST
Highlights

ఓ ప్రభుత్వోపాధ్యాయుడు వ్యసనాలకు అలవాటు పడి దొంగగా మారాడు. రూ.1.50లక్షల నగదు బ్యాగును లాక్కుని పారిపోయాడు. 

సంగారెడ్డి : ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొంగతనాలకు అలవాటుపడ్డాడు. విద్యార్థులకు మంచి బుద్ధులు నేర్పి సక్రమమైన మార్గంలో నడపాల్సిన అతడే వక్రమార్గంలో పయనించాడు. అతని నేరప్రవృత్తితో గతంలో ఓసారి సస్పెన్షన్కు గురయ్యాడు. అయినా అతని బుద్ధి మారలేదు. తాజాగా రూ.1.50లక్షలు దొంగతనం చేశాడు.  అంతకు ముందు ఒకసారి మహిళ టీచర్ సెల్ ఫోన్ కు అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడు. ప్రస్తుతం చోరీ కేసులో పట్టుపడ్డాడు. దీనికి సంబంధించి డీఎస్పీ రవీంద్రారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…

విద్యుత్ శాఖ ఉద్యోగి కె రాములు. ఇతడు సంగారెడ్డి నివాసి. పదవ తేదీన స్థానికంగా ఉన్న ఓ బ్యాంకులో వ్యక్తిగత అవసరాల నిమిత్తం రూ.1.50లక్షలు డ్రా చేశాడు. దీనికోసం భార్యతో కలిసి టూ వీలర్ పై వచ్చాడు. బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసిన తర్వాత టూ వీలర్ పై వెడుతూ మధ్యలో కూరగాయలు కొనుక్కోవడం కోసం ఆగారు. అయితే అతను బ్యాంకులో డబ్బులు డ్రా చేయడం గమనించిన సార సంతోష్ అనే వ్యక్తి బ్యాంకు దగ్గర నుంచే రాములును అనుసరిస్తూ వచ్చాడు. కూరగాయల కోసం ఆగగానే డబ్బులున్న సంచిని లాక్కొని పారిపోయాడు. అదే రోజు బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్‌లో ఈడీ సోదాలు.. 90 కోట్లు ఫ్రీజ్

దీనిమీద వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. ఆ డబ్బులు దాక్కొని పారిపోయింది జోగిపేటలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్న సంతోష్ అని గుర్తించారు. అతని కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఈ నెల 17వ తేదీన నిందితుడిని సంగారెడ్డిలో పట్టుకున్నారు. అతడిని పట్టుకుని విచారించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడై ఉండి కూడా దుర్ఘసనాలకు అలవాటుపడ్డాడని.. అందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్లు తేలింది.

పోలీసులకు దొరకకుండా ఉండడానికి తన బండి నెంబర్ ప్లేట్ ను తిప్పిపెట్టి.. తప్పించుకుంటున్నట్లు తెలిసింది. సంతోష్ మీద గతంలో కూడా ఒక కేసు నమోదయింది. నాలుగు నెలల క్రితం జిల్లాలోని ఓ హెడ్మాస్టర్ సెల్ ఫోన్ కు అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడు.  దీంతో ఆమె పోలీసులు ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు సారా సంతోష్ ను అప్పుడు సస్పెండ్ చేశారు. తిరిగి పది రోజుల క్రితమే అతడు విధుల్లో చేరాడు. నిందితుడు నుంచి రూ.1.50లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. 

click me!