ఐటీ అధికారుల విచారణకు ఇవాళ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి , మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి హాజరయ్యారు. ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్టుగా చెప్పారు.
హైదరాబాద్: గత వారం నిర్వహించిన సోదాలకు సంబంధించి సోమవారంనాడు మర్రిరాజశేఖర్ రెడ్డి, భద్రారెడ్డిని ఐటీ అధికారులు హైద్రాబాద్ లో విచారించారు. ఆరుగంటలకు పైగా ఐటీ అధికారులు వీరిని విచారించారు.వీరిద్దరితో పాటు ఎనిమిది మందిని ఐటీ అధికారులు ప్రశ్నించారు.పలు కాలేజీలకు చెందిన ప్రిన్సిపాల్స్, అకౌంటెంట్లు, ఇతర సిబ్బంది విచారణకు హాజరయ్యారు. మల్లారెడ్డి కాలేజీలకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ ను రేపు విచారణకు రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. ఇవాళ నిర్వహించిన విచారణ ఆధారంగా మరో 10 మందికి నోటీసులు జారీ అయ్యాయి. డిసెంబర్ 5వ తేదీ వరకు ఐటీ అధికారులు విచారణ నిర్వహించనున్నారు. ఇవాళ విచారణకు హాజరైన త్రిశూల్ రెడ్డి, లక్ష్మారెడ్డిని మరో రోజున విచారణకు రావాలని ఐటీ అధికారులు తిప్పి పంపారు.
ఈ నెల 22, 23 తేదీల్లో ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నెల 24వ తేదీతో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు, బందువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులివ్వడంతో ఇవాళ ఎనిమిది మంది విచారణకు హాజరయ్యారు. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి సహా ఎనిమిది మంది హాజరయ్యారు.
also read:నేడు ఐటీ అధికారుల విచారణకు మంత్రి మల్లారెడ్డి దూరం.. హాజరుకానున్న కుటుంబ సభ్యులు..
ఐటీ అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పినట్టుగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చెప్పారు. ఐటీ అధికారుల ప్రశ్నలకు తాము ఇంకా సమగ్రంగా సీఏతో ఇవ్వనున్నట్టుగా చెప్పామన్నారు. అవసరమైనప్పుడు విచారణకు రావాలని కోరితే వస్తామని చెప్పారు. కాలేజీల్లో పనిచేసే అకౌంటెంట్లు, ప్రిన్సిపాల్స్ వచ్చినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం చెప్పారన్నారు. తాము ఇచ్చిన సమాధానాలతో ఐటీ అధికారులు సంతృప్తి చెందారనే అభిప్రాయాన్ని మంత్రి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డి చెప్పారు.ఐటీ అధికారులు ఇచ్చిన ఫార్మెట్ ప్రకారంగా సమాచారం ఇచ్చామన్నారు.