గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో కీలక పరిణామం: భార్య హాసీనాకి ఐటీ శాఖ నోటీసులు

By narsimha lodeFirst Published Mar 28, 2022, 7:59 PM IST
Highlights

గ్యాంగ్‌స్టర్ నయీం బినామీ ఆస్తుల్లో పదింటిని ఐటీ శాఖ సీజ్ చేసింది. మొత్తం 40 ఆస్తుల్లో పదింటిని ఐటీ శాఖ సీజ్ చేసింది. అయితే ఈ ఆస్తుల కేసుల్లో నయీం భార్య హాసినికి ఐటీ శాఖ నోటీసులు పంపింది. 

హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ Nayeemఆస్తుల కేసులో సోమవారం నాడు కీలక పరిణామం చోటు చేసుకొంది.  రూ. 150 కోట్ల విలువైన  10 ఆస్తులను Income tax ఇప్పటికే సీజ్ చేసింది. నయాం కేసును విచారించిన పోలీసు అధికారుల నుండి ఆదాయ పన్ను శాఖాధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ఆస్తులను సీజ్ చేశారు. నయీంకు చెందిన 40 ఆస్తుల్లో 10  ఆస్తులను సీజ్ చేశారు.  ఈ ఆస్తుల విషయమై నయీం భార్య Haseenaకి  ఆదాయ పన్ను శాఖాధికారులు సీజ్ చేశారు.

గతంలో కూడా నయీం బినామీ ఆస్తుల కేసుకు సంబంధించి ఆదాయ పన్ను శాఖాధికారులు ఆయన భార్య హసీనాకు నోటీసులు ఇచ్చారు. ఈ విషయమై గతంలో కూడా ఆమె ఆదాయ పన్ను శాఖ విచారణకు హాజరయ్యారు. బినామీ ఆస్తుల విషయంలో తనకు తెలియదని గతంలో విచారణకు హాజరైన సమయంలో  హాసీనా వివరించారు. నయాం గ్యాంగ్ నల్గొండతో పాటు పరిసర ప్రాంతాల్లో బినామీ ఆస్తులను సంపాదించింది.

click me!