తెలంగాణలో ఇక నుంచి ‘ఎంసెట్’ మాయం.. ఎందుకంటే ?

By Sairam Indur  |  First Published Jan 15, 2024, 1:05 PM IST

TS EAMCET : తెలంగాణలో ఎంసెట్ పేరు మారే అవకాశం కనిపిస్తోంది. కొన్నేళ్ల నుంచి ఎంసెట్ (EAMCET) ద్వారా మెడికల్ సీట్లను భర్తీ చేయడం లేదు. అయినప్పటికీ మెడిసిన్ కోర్సును సూచించే ఎం అనే పదం కొనసాగుతూనే వస్తోంది. అయితే దానిని తొలగించాలని ఇటీవల టీఎస్ సీహెచ్ఈ (TSCHE)ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. కొత్త పేరు TS EAPCET లేదా TS EPACETగా ఉండే అవకాశం ఉంది.


TS EAMCET : తెలంగాణలో ఎంసెట్ పేరు మార్చేందుకు ఎట్టకేలకు రంగం సిద్ధమయ్యింది. ఎంసెట్ పరీక్ష నిర్వహించి దీని ద్వారా రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సులను భర్తీ చేస్తున్నారు. మొదట్లో ఈ ఎంసెట్ ద్వారా మెడికల్ సీట్లు కూడా భర్తీ చేసేవారు. కానీ ఐదారేళ్లుగా మెడికల్ సీట్ల భర్తీని నీట్ ద్వారా చేపడుతున్నారు. అందుకే ఇందులో మెడికల్ పేరును సూచించే అక్షరాన్ని తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దానికి బదులుగా ఫార్మసీ పదాన్ని సూచించే పీ అనే అక్షరాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం అనుకుంటోంది.

విషాదం.. మాంజా దారం మెడకు చుట్టుకుని ఆర్మీ జవాను మృతి

Latest Videos

undefined

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) యూజీని ప్రవేశపెట్టిన అనంతరం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలను ఎంసెట్ నుంచి తొలగించారు. అయితే ఎంసెట్ లో 'మెడిసిన్ ' అనే పదం కొన్నేళ్ల నుంచి అలాగే కొనసాగుతోంది. దానిని తొలగించాలని ప్రభుత్వం టీఎస్ సీహెచ్ఈ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన తరువాత గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో స్థానంలో కొత్త జీవో విడుదల చేయాల్సి ఉంటుంది.

ప్రభుత్వాన్ని కూలగొట్టే ధైర్యం బీఆర్ఎస్ కు లేదు - మంత్రి పొన్నం ప్రభాకర్

ఈ మార్పు వల్ల టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్)గా ఉన్న పేరు ఇక నుంచి టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAPCET)గా లేదా టీఎస్ ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EPACET)టీఎస్ ఈపీఏసెట్)గా మారే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచే దీనిని అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్.. దమ్ముంటే నేరుగా రావాలని సవాల్ విసిరిన బీజేపీ ఫైర్ బ్రాండ్..

అయితే పేరు మార్పు వల్ల వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇప్పటిలాగే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతాయి. అయితే టీఎస్ ఈఏపీ సీఈటీ లేదా ఈపీఏ సీఈటీలో వచ్చిన మార్కులను బీఎస్సీ నర్సింగ్ ప్రవేశాలకు కూడా ఉపయోగిస్తారు. ఇది గతంలో కూడా ఉంది. కాగా.. ఈ ఏడాది మే 10 నుంచి అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు, మే 12న ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ తేదీలను టీఎస్ సీహెచ్ఈ ప్రతిపాదించిగా.. ప్రభుత్వ ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. 

click me!