నవ యవ్వనంలో కేటీఆర్ ఎలా వున్నాడో చూడండి...

By Arun Kumar P  |  First Published Jan 15, 2024, 12:31 PM IST

సంక్రాంతి పండగ వేళ తాను యువకుడిగా వున్న ఫోటోను మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ద్వాారా పంచుకున్నారు.  


హైదరాబాద్ : మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంక్రాంతి పండగ సందర్భంగా పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 20 ఏళ్ల క్రితంనాటి తన ఫోటోను ఎక్స్(ట్విట్టర్) వేదికన పంచుకున్నారు కేటీఆర్. కాలం ఎంత తొందరగా సాగిపోతోంది... ఈ ఫోటో దిగి అప్పుడే రెండు దశాబ్దాలు పూర్తయ్యిందా...! అంటూ కేటీఆర్ ఆశ్చర్య వ్యక్తం చేసారు.

ఇక సంక్రాంతి సందర్భంగా ఓ అభిమాని కేటీఆర్ పేరుతో పిండివంటలు తయారుచేసారు... వీటిని ఆయనకే ట్యాగ్ చేసారు. దీనిపై స్పందించిన కేటీఆర్ చాలా క్రియేటివ్ గా సకినాలతో శుభాకాంక్షలు తెలిపారని అన్నారు. అలాగే ఈ మకర సంక్రాంతి మీ జీవితంలో అందమైన క్షణాలను అందించాలని ... పతంగుల మాదిరిగానే మీ కోరికలు, కలలు కొత్త శిఖరాలకు చేరుకోవాలని ఆశిస్తున్నానని కేటీఆర్ అన్నారు.  

Once upon a time, over 20 years ago 😁

Time Does Fly pic.twitter.com/BIymQTyu4G

— KTR (@KTRBRS)

Latest Videos

 


 

click me!