Hyderabad: తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరన శాఖ (ఐఎండీ) హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అలాగే, ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాల సీజన్ లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది.
Rising temperatures in Telangana: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. అయితే, ప్రస్తుత వారంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయని భారత వాతారణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని చాలా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న హైదరాబాద్ కు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
బుధవారం నాడు ఆదిలాబాద్ లో అత్యధికంగా 42.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాలలో 41.5, మంచిర్యాలలో 41, కుమురం భీంలో 40.5, నల్లగొండలో 40.5, ఆదిలాబాద్ లో 40.3, యాదాద్రి భువనగిరిలో 40.3, ములుగులో 40.3, నాగర్ కర్నూల్ లో 40.1 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో అత్యధికంగా ఖైరతాబాద్ లో 37.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ మంగళవారం అంచనా వేసింది. ఎల్ నినో అనేది దక్షిణ అమెరికాకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలోని జలాల వేడెక్కడం, ఇది సాధారణంగా భారతదేశంలో రుతుపవనాలు బలహీనపడటం, పొడి వాతావరణంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ సంవత్సరం ఎల్ నినో పరిస్థితులు వరుసగా మూడు లా నినా సంవత్సరాలను అనుసరిస్తాయి, ఇవి సాధారణంగా వర్షాకాలంలో మంచి వర్షపాతాన్ని తెస్తాయి.
భారతదేశ వ్యవసాయ భూభాగానికి సాధారణ వర్షపాతం కీలకం. నికర సాగు విస్తీర్ణంలో 52 శాతం దానిపై ఆధారపడి ఉంది. దేశవ్యాప్తంగా విద్యుదుత్పత్తితో పాటు తాగునీటికి కీలకమైన రిజర్వాయర్ల పునరుద్ధరణకు కూడా ఇది కీలకం. వానాకాలం సీజన్ పై ఎక్కువగా ఆధారపడి సాగు చేస్తున్న వ్యవసాయ రంగానికి ఐఎండీ అంచనా ఉపశమనం కలిగిస్తోంది.