ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు మరో రెండు రోజుల పాటు వర్షాలు: పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ

By narsimha lode  |  First Published Oct 7, 2022, 10:07 AM IST

రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది.  ఇప్పటికే రెండు రోజులుగా రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. గతరెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో  రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో జనజీవనం  అస్తవ్యస్తంగా మారింది. 

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికేరెండు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైద్రాబాద్, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.దీంతో లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వాగులు, వంకలకు వరద పోటెత్తింది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

Latest Videos

undefined

ఇవాళ  వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపు నిజమాబాద్, నల్గొండ, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్,వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాలజిల్లాలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ పలు జిల్లాల్లో వర్షాలు  కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కృష్ణా,గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఇప్పటికే రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాశం, గుంటూరు,

రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా, గోదావరి, కృష్ణా నదుల్లో వరద పెరుగుతుంది.  నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల ప్రాజెక్టులకు వరద పోటెత్తింది.గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు కూడా వరద పెరుగుతుంది. 
 

click me!