ఎన్నికలను బహిష్కరించిన ఇమాంనగర్ గ్రామస్థులు

Published : Dec 07, 2018, 09:59 AM IST
ఎన్నికలను బహిష్కరించిన ఇమాంనగర్ గ్రామస్థులు

సారాంశం

ఖమ్మం జిల్లాలో ఓ గ్రామం ఎన్నికలను బహిష్కరించింది. జిల్లాలోని ఇమాంనగర్ గ్రామస్థులు తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గత నాలుగున్నరేళ్లుగా తమ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ఎంతమందినో కలిశామని అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. 

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఓ గ్రామం ఎన్నికలను బహిష్కరించింది. జిల్లాలోని ఇమాంనగర్ గ్రామస్థులు తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గత నాలుగున్నరేళ్లుగా తమ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు ఎంతమందినో కలిశామని అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. 

తమ సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిష్కరించలేదని అందువల్లే తాము పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. తమ సమస్యలు ఇప్పటికైనా పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు.  

ఇమాంనగర్ గ్రామస్థులు ఎన్నికలు బహిష్కరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే అటు అధికారులు సైతం ప్రజలను బుజ్జగించేందుకు బయలుదేరినట్లు తెలుస్తోంది. అటు  ప్రజాప్రతనిధులు సైతం ఇమాంనగర్ గ్రామానికి క్యూ కట్టినట్లు తెలుస్తోంది.    

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా