కొడంగల్‌‌లో ఉద్రిక్తత...

By Arun Kumar PFirst Published Dec 7, 2018, 9:49 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గ పరిధిలోని ఎన్నికల సరళిని పరిశీలించేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి కోస్గి కి వెళ్లారు. అయితే ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనంలో మారణాయుధాలు ఉన్నాయంటూ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. 

కేవలం ఆయధాలున్న వాహనాన్నే కాకుండా నరేందర్ రెడ్డి వాహనాన్ని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు వారికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

టీఆర్ఎస్ నాయకులు నరేందర్ రెడ్డి సురక్షితంగా అక్కడ దగ్గర్లోని ఓ టీఆర్ఎస్ నాయకుడి ఇంటికి తీసుకెళ్లారు. ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి ఘర్షణ జరక్కుండా ఇరు వర్గాలను నచ్చజెప్పి పంపించారు. 

తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందుకోసం బలమైన అభ్యర్థిగా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది. దీంతో కోడంగల్ లో పోటీ రసవత్తరంగా మారింది. 

అయితే గత కొన్ని రోజులుగా కోడంగల్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థి బందువు ఫామ్ హౌస్ లో ఐటీ దాడులు, రేవంత్ రెడ్డి వర్గంపై పోలీసుల దాడులు, అర్థరాత్రి రేవంత్ అరెస్ట్ ఇలా కొడంగల్ లో నిత్యం ఏదో ఒక అలజడి జరిగింది. అందువల్ల ఇక్కడ పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా ఈసీ, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
click me!