కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు.. రెక్కలతో స్వతహాగా ఎగురగలను - బీజేపీ ఎంపీ సంచనల వ్యాఖ్యలు

By Sairam IndurFirst Published Mar 3, 2024, 12:18 PM IST
Highlights

తాను ఎవరిపై ఆధాపడి లేనని బీజేపీ నాయకుడు, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ అన్నారు. పార్టీ టికెట్ ఇవ్వకపోతే తన దారి తాను చూసుకుంటానని చెప్పారు. తనకు టికెట్ దక్కకుండా పార్టీలోని అగ్రనేతలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టిక్కెట్ రాకుండా సొంత పార్టీలో అగ్ర స్థాయి నాయకులు అడ్డుపడ్డారని మండిపడ్డారు. తాను ఎక్కడ కేంద్ర మంత్రిని అవుతానని వాళ్లకు భయం పట్టుకుందని అన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శనివారం 195 మందితో మొదటి లిస్ట్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 9 స్థానాలు ఉండగా.. ఆదిలాబాద్ స్థానంపై సంగ్దిదత నెలకొంది. ఆ స్థానం నుంచి ఏ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో సోయం బాపురావుకు టికెట్ ఇవ్వబోరని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ముంబై దాడుల కీలక సూత్రధారి ఆజం చీమా మృతి

బీజేపీ విడుదల చేసే రెండో లిస్ట్ లో తన పేరు ఉంటుందని సోయం బాపురావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివాసి నాయకుడినైన తనకు టిక్కెట్ రాకుండా పార్టీ అగ్ర నాయకులే పావులు కదిపారని చెప్పారు. తాను గెలుస్తాననే భయం వాళ్లకు పట్టుకుందని ఆరోపించారు. తాను కొమ్మపై ఆధారపడి జీవించే పక్షిని కాదని అన్నారు. తాను రెక్కలపై ఆధారపడ్డానని, సొంతంగా ఎగురగలుగుతానని చెప్పారు. 

వావ్.. హైదరాబాద్ లక్క గాజులకు జీఐ ట్యాగ్

ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ టికెట్ కేటాయించకపోతే తన దారి తాను చూసుకుంటానని బాపురావు స్పష్టం చేశారు. అయినా పార్టీ తనకే టికెట్ కేటాయిస్తుందని నమ్మకం ఉందని అన్నారు. తప్పకుండా మళ్లీ ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. 2019లో బీజేపీ టికెట్ ఇస్తామని చెప్పినా.. కొందరు నాయకులు పారిపోయారని, అలాంటి వారే ఇప్పుడు టికెట్ కోసం పోటీకి వస్తున్నారని తెలిపారు. పార్టీకి బలం లేని సమయంలో కూడా సొంత బలంతో గెలిచానని అన్నారు. బీజేపీ బలాన్ని అందించానని చెప్పారు.

ఉన్నత విద్యతో అధిక జీవిత కాలం.. వృద్ధాప్యమూ నెమ్మదిగానే - కొత్త స్టడీలో ఆసక్తికర విషయాలు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పలువురు జడ్పీటీసీలు, ఎంపీటీసీలను పార్టీ తరుఫున గెలిపించుకున్నానని సోయం బాపురావు చెప్పారు. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న నాలుగు ఎమ్మెల్యే స్థానాలను కూడా బీజేపీకి వచ్చేలా చేశానని అన్నారు. తన బలం, బలగం పార్టీకి కావాలని అనుకుంటే బీజేపీ టికెట్ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

click me!