‘‘నేను అమ్మాయిని’’..పోలీసులకు యువకుడి ఝలక్

By ramya neerukondaFirst Published Jan 12, 2019, 10:59 AM IST
Highlights

చీటింగ్ కేసులో ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేయగా.. అతను ఇచ్చిన ఝలక్ కి పోలీసులు షాక్ తిన్నారు. 

చీటింగ్ కేసులో ఓ వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేయగా.. అతను ఇచ్చిన ఝలక్ కి పోలీసులు షాక్ తిన్నారు. నేను అబ్బాయిని కాదు.. అమ్మాయిని.. జెండర్ ఫీమేల్ అని రికార్డ్స్ లో రాయండి అంటూ పోలీసులకు చెప్పాడు. దీంతో.. అతను చెప్పేది నిజమా కాదా.. అని తేల్చుకునే పనిలో పడ్డారు పోలీసులు.

పూర్తి వివరాల్లోకి వెళితే... నగరంలోని టోలీచౌకికి చెందిన అజీముద్దీన్‌ కార్లను అద్దెకు ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో సెల్వ్‌ డ్రైవింగ్‌ కోసం కారు అద్దెకు కావాలని అడిన వారికి గత ఏడాది డిసెంబరులో అతను కాప్రా వచ్చి కారును అప్పగించాడు. అయితే కారు తీసుకున్న వ్యక్తులు ముఖం చాటేయడంతో అతను కుషాయిగూడ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈనెల 3న అనంతపురం వాసి పోతులయ్య, నగరంలోని యూసఫ్‌గూడకు చెందిన సయ్యద్‌ సిరాజ్‌ హుస్సేన్‌ను అరెస్ట్‌ చేశారు.

కేసు ఫైల్ చేసే క్రమంలో తన జెండర్ ఫీమేల్ గా రాయలని సిరాజ్ కోరడం పోలీసులను షాకింగ్ కి గురిచేసింది.  విచారణలో తనది కరీంనగర్ జిల్లా అని.. పుట్టుకతో అమ్మాయినని చెప్పాడు. మూడేళ్ల క్రితం ముంబయి వెళ్లి.. అక్కడ ఆపరేషన్ చేయించుకొని అబ్బాయిగా మారినట్లు చెప్పారు. అయితే.. సిరాజ్ చెప్పింది నిజమో కాదో తేల్చుకునే పనిలో పడ్డారు పోలీసులు.
 
సిరాజ్ నిజంగా ట్రాన్స్ జెండర్ అవునో కాదో చెప్పాలని.. వైద్యులను కోరారు. అతనికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. పది, పదిహేను రోజుల్లో రిపోర్ట్స్ వస్తాయని.. ఆ తర్వాత నిజం తెలుస్తుందని పోలీసులు చెప్పారు. 

click me!