సీఎల్పీ నేత రేసులో ఉన్నాను.. రాజగోపాల్ రెడ్డి

Published : Jan 12, 2019, 10:34 AM IST
సీఎల్పీ నేత రేసులో ఉన్నాను.. రాజగోపాల్ రెడ్డి

సారాంశం

తాను సీఎల్పీ నేత రేసులో ఉన్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. 

తాను సీఎల్పీ నేత రేసులో ఉన్నానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. భువనగిరి ఎంపీతోపాటు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవం తనకు ఉందని.. అవకాశం ఇస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్ ని బలమైన శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను సీల్పీనేత రేసులో ఉన్నానని.. అయితే.. అదిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటామని చెప్పారు. ఎమ్మెల్యే ఎన్నికై.. నెల రోజులు కావస్తున్నా.. ప్రమాణ స్వీకారం చేయించలేదని మండిపడ్డారు.

రాష్ట్రంలో వన్ మేన్ షో నడుస్తోందని... ప్రాజెక్టుల సమీక్షలు, ఢిల్లీ పర్యటనలు, సమీక్షలు పంచాయితీ ఎన్నికల నిర్వహణ ఇలా అన్ని పనులు కేసీఆర్ ఒక్కరే చూసుకుంటున్నారని దుయ్యబట్టారు. హరీశ్ రావుని కూడా పక్కనపెట్టేశారని మండిపడ్డారు. పంచాయితీ ఎన్నికల్లో తమ కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని ధ్వజమెత్తారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్