ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విరసం, పౌరహక్కుల సంఘాల నేతల ఇళ్లలో సోదాలు

By narsimha lodeFirst Published Apr 1, 2021, 9:41 AM IST
Highlights

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విరసం, పౌరహక్కుల సంఘాల నేతల ఇళ్లపై ఎన్ఐఏ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.


హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విరసం, పౌరహక్కుల సంఘాల నేతల ఇళ్లపై ఎన్ఐఏ  అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో న్యాయవాది పద్మ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. బుధవారం నాడు సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగించారు.  పద్మ నివాసంలోని కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ , కొన్ని పత్రాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకొన్నట్టుగా సమాచారం.

హైదరాబాద్, గుంటూరు, విశాఖ, రాజమండ్రి,కడపలలో ఎన్ఐఏ అధికారులు పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఉపా కేసుకు సంబంధించి ఎన్ఐఏ సోదాలు జరిపారని న్యాయవాది పద్మ మీడియాకు చెప్పారు.

విశాఖ జిల్లాలోని ముంచంగిపుట్టు కేసుకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు సోదాలు  నిర్వహించినట్టుగా తనకు చెప్పారని ఆమె మీడియాకు తెలిపారు.ముంచంగిపుట్టు కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని పద్మ ప్రకటించారరు. ఎన్ఐఏ అధికారుల ఆరోపణల్లో వాస్తవం లేదని ఆమె ప్రకటించారు.

కోరెగావ్ కేసుతో పాటు ముంచంగిపుట్టుకు సంబందించి ఎన్ఐఏ అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారని సమాచారం.అరెస్టైన నాగన్న తన క్లయింట్ అని ఆమె చెప్పారు. మావోయిస్టులను కలిసినట్టుగా ఎన్ఐఏ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆమె తెలిపారు.ఎన్ఐఏ సోదాలపై కోర్టును ఆశ్రయిస్తానని ఆమె చెప్పారు.

విశాఖలో చలం, సుమ ఇళ్లల్లో కూడ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఏపీ రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు చిట్టిబాబు ఇంట్లో కూడ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఇవాళ విచారణకు రావాలని ఎన్ఐఏ చిట్టిబాబును ఆదేశించింది. 

ఇక హైద్రాబాద్ లో కూడ ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. సరూర్‌నగర్ పోస్టల్ టెలిఫోన్ కాలనీలో నివాసం ఉంటున్న అడ్వకేట్ రఘునందన్, మెహిదీపట్నంలో ఉంటున్న డప్పు రమేష్, జవహర్ నగర్ లో ఉన్న జాన్ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.  

ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించడం, మావోయిస్టులకు సమచారాన్ని అందిస్తున్నారనే వీరిపై కేసులు నమోదయ్యాయి.విరసంతో పాటు ప్రజా సంఘాల నేతల ఇళ్లలో కూడ ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు.

click me!